వాతావరణంలో ఎప్పుడూ మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా ఇలాంటి మార్పులు వస్తున్నాయి.. మొన్న టివరకూ అల్పపీడన ప్రభావం వల్ల దేశంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.. ఇప్పుడు మరోసారి అల్పపీడన ప్రభావం మన దేశం పై పడింది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న వేడిగాలు తో దక్షిణాది రాష్ట్రాలై న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం పొడిగా మారింది.. పగలు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఒక్కోసారి హెచ్చరించారు..


దక్షిణ బంగాళాఖాతం లో మార్చి 16న అల్ప పీడనం ఏర్పడింది. ఇకపోతే ఈ అల్పపీడనం నెమ్మదిగా తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం కు దగ్గరలో ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదుగా వెళుతోంది. అలాగే రేపు ఈ అల్పపీడనం ఈశాన్య దిసగా పయనిస్తుంది. అప్పుడు అల్పపీడనం మరింత బలపడానికి వీలు ఉందని వాతావరణ అధికారులు చెబుథున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో మార్చి 20న వాయుగుండంగా మారి, మార్చి 21న తుఫాన్‌గా తీవ్ర రూపం దాల్చుతుంది.


తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉందని ఎక్కువగా వినిపిస్తోంది. మరో వైపు ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రెండు రోజులపాటు రాయల సీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణం పొడిగా మారుతుంది. కొన్నిచోట్ల వడగాల్పులు వీచడంతో ఉక్కపోత కూడా ఉందని అధికారులు అంటున్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్తున్న వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొవాలని అంటున్నారు. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మిర్యాలగూడ లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాడిపోవడంతో వాతావరణం లో మార్పులు రావడంతో వేడి ఎక్కువ అయిందని అంటున్నారు. ఇంక పలు జిల్లాల్లో కూడా వాతావరణంలో తేడాలు వస్తాయని అధికారులు అంటున్నారు.  జనాలు జాగ్రత్రలు తీసుకొవాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: