రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య పోరు ఇప్పట్లో ముగిసేటట్టు లేదు. ఒకరికంటే ఒకరు ఎక్కువగా తగ్గేది లేదంటూ యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. దీంతో రష్యా రోజురోజుకు ఉక్రెయిన్ మీద దాడిని పెంచుతూనే ఉంది. ఓవైపు బాంబులు మిస్సిల్ వర్షం కురిపిస్తోంది. రష్యాపై ప్రపంచదేశాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేసిన, కఠిన చర్యలు ఉంటాయని వార్నింగు లు ఇచ్చినా పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటు తను అనుకు న్నది సాధిస్తాం అని చెబుతూ వస్తున్నారు. ఇదిలా ఉండగానే ఉక్రెయిన్ పై  విరుచుకు పడుతున్న రష్యా విషయంలో మాత్రం తటస్థంగా ఉన్నటువంటి ఇండియాపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ దేశంపై చర్యలు తీసుకోవడానికి భారత్ ఎందుకు బలహీనంగా ఉంటుంది అని అన్నారు. అమెరికా మిత్ర దేశాలన్నీ ఐక్యంగా ఉంటూ రష్యా పై ఒత్తిడి తీసుకురావడానికి ముందుకు పోతుంటే భారత్ మాత్రం బలహీనంగా ఉంటూ స్పందించడం లేదని అన్నారు. సీఈఓలతో జరిగినటువంటి సమావేశాలలో బైడెన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ రష్యా యొక్క దురాక్రమణను ఖండిం చడం లో భారత్ మాత్రమే భిన్నంగా వ్యవహరిస్తోందని, కుదుపునకు గురి చేసేలా ఉందని అన్నారు బైడెన్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యతిరేకంగా అమెరికా ఆధ్వర్యంలో భాగస్వామ్య పక్షమైన నాటో ఐరోపా యూనియన్ ఆసియా భాగస్వామ్య దేశాలు ఐక్యంగా నిలబడటంపై బైడెన్ అభినందించారు.

 రష్యాను అసాధారణ స్థాయిలో ఆర్థిక అంశాల తో కట్టడి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఏది ఏమైనా భారతదేశాన్ని  ఎలాగోలా యుద్ధ వాతావరణంలోకి లాగాలని అమెరికా శతవిధాల ప్రయ త్నాలు చేస్తోందని ఈ వాతావరణం చూస్తేనే అర్థం చేసు కోవచ్చు. మరి చివరికి ఈ యుద్ధం చిలికి చిలికి గాలివానలా మారి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా పరిస్థితులు కనబడుతున్నాయి. ముందుముందు చూడాలి ఇంకా ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: