దాదాపు మూడేళ్ళ పాటు ముప్ప తిప్పలు పెట్టిన కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలను కనికరిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో వివిధ దేశాలు కరోనా ఆంక్షలను నెమ్మదిగా సడలించుకుంటూ యదావిధిగా తమ జీవన శైలికి మారుతున్నాయి. ఇటు భారత దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గడంతో ఆంక్షలు దాదాపుగా ఎత్తేశారు, ఎయిర్ లైన్స్ పై కూడా ఆంక్షలు సడలిస్తున్నారు.  
అయితే కరోనా పుట్టినిల్లు చైనాలో మాత్రం వైరస్ ఏ మాత్రం తగ్గడం లేదు.  పాజిటివ్ కేసుల సంఖ్య తరచూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అక్కడి అధికారులు ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు, పలు ప్రాంతాలలో లాక్ డౌన్ లను సైతం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

 తాజాగా ఈశాన్య చైనాలోని బయా చెంగ్లోనూ  లోనూ కొత్తగా మరో సారి లాక్ డౌన్ విధించారు. అదే విధంగా హైనన్ ప్రావిన్సులోని సాన్యా నగరానికి వాహన రాకపోకలపై కూడా నిషేధం విధించారు. రెండున్నర కోట్ల జనాభా ఉన్న షాంఘైలో ఈ క్రమంలో కఠిన ఆంక్షల పట్ల చైనీయులు పెద్ద యెత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆంక్షలను కాస్త తగ్గించాలనే ఆలోచనలో డ్రాగన్ దేశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దాని వలన కరోనా కంట్రోల్ కాదు సరికదా, వ్యాప్తి మరింత పెరిగి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. దీని వలన మళ్ళీ అవి ఇతర దేశాలకు పాకే ప్రమాదం లేకపోలేదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


 ఈ నేపథ్యంలో పలువురు భారతదేశ వైద్య నిపుణులు ముందుగానే జాగ్రత్త అవసరమని చైనా రాకపోకల విషయంలో మరి కొద్ది రోజులు జాగ్రత్త అవసరమని లేదంటే కరోనా ప్రభావం మన దేశంపై కూడా పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారట. మరి అధికారులు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: