ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త మాత్రమే కానీ ప్రజానేత మాత్రం కాడు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ (పీకే) లాంటి వ్యూహకర్తలు చాలామందున్నారు. కాకపోతే శాస్త్రీయంగా సర్వేలు నిర్వహించి, విశ్లేషణలు చేసేందుకు నూరుశాతం శిక్షణ పొందిన పెద్ద బృందం ఉందికాబట్టి వ్యూహకర్తగా పీకే దేశంలో చాలా తొందరగా పాపులరైపోయారు. ఇప్పుడిదంతా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరటానికి పీకే నిరాకరించటంతో పెద్ద ఎత్తున విశ్లేషణలు మొదలైపోయాయి.





కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధితో వరుసగా భేటీలు జరిపి వచ్చే నెలలో పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం నుండి హఠాత్తుగా చేరటం లేదని ట్విట్ చేసే మధ్యలో ఏమి జరిగుంటుంది ? అన్నదే పెద్ద ప్రశ్న. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పునరుజ్జీవనానికి తానిచ్చిన సలహాలు, సూచనల అమలు బాధ్యత తనకే అప్పచెప్పాలని పీకే షరతు విధించారట. అయితే సలహాలు, సూచనలు ఇచ్చినంత మాత్రాన అమలు బాధ్యతలు పీకే చేతిలో పెట్టడానికి కాంగ్రెస్ సీనియర్ల అంగీకరించలేదని పార్టవర్గాలు చెప్పాయి. .





కాంగ్రెస్ అంటేనే నానాజాతి సమితి. ఎక్కడెక్కడి రాష్ట్రాల నుండి డక్కా మొక్కీలు తిని దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్లు  పీకే నేతృత్వంలో పనిచేయటానికి నిరాకరించారట. ఒక్క సీనియర్లకే కాదు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు కూడా ఇదే వర్తిస్తుంది. పార్టీ నాయకత్వం పగ్గాలు తమ చేతుల్లో నుండి బయటకు వెళ్ళిపోవటానికి గాంధీ కుటుంబం ఎందుకు అంగీకరిస్తుంది.





ఇదే విషయాన్ని గాంధీ కుటుంబం సీనియర్లతో చెప్పించిందట. కావాలంటే పదిమంది సీనియర్లతో పాటు పీకేని కూడా కలిసి టీం వర్క్ చేయమని సోనియా చెప్పారని సమాచారం. ఇంతమంది సీనియర్లతో పనిచేయటం సాధ్యంకాదని, తన ప్లాన్ అనుకున్నది అనుకున్నట్లు అమలయ్యే అవకాశం లేదని పీకేకి అర్ధమైపోయుంటుంది. అందుకనే పార్టీలో చేరి అందరితో కలిసి పనిచేయటం కన్నా సలహాదారుగా ఉండటమే మేలని పీకేకి అర్ధమైయ్యుంటుంది. అందుకనే సోనియా ప్రతిపాదనను పీకే సున్నితంగా తిరస్కరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: