వైసీపీ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో ఎల్లోమీడియా దెబ్బ తప్పేట్లు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిపై పోరాడే విషయంలో చంద్రబాబునాయుడు అండ్ కో ఫెయిలైపోయారు.  వాళ్ళకు మద్దతుగా ఎల్లోమీడియా ఆ బాధ్యతను భుజనేసుకుంది. అందుకనే రాష్ట్రంలో ఎక్కడ ఏచిన్న ఘటన జరిగినా దాన్ని పెద్దదిగా గ్లోరిఫై చేసేసి నానా రచ్చ చేస్తోంది. ఎల్లోమీడియా టార్గెట్ ఏమిటంటే జగన్ ప్రభుత్వాన్ని గబ్బుపట్టించటమే.





నవరత్నాల పేరుతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న విషయం తెలిసిందే. వీటి అమలులో ఎక్కడ కూడా అవినీతి జరగటంలేదు. అందుకనే పథకాల అమలులో అవినీతి జరుగుతోందని మూడేళ్ళల్లో చంద్రబాబు కానీ ఎల్లోమీడియా కానీ ఆరోపణలు చేయలేదు. మరిలాగే వదిలేస్తే ప్రజల మనస్సుల్లో జగన్ పాతుకుపోవటం ఖాయం. అలాంటపుడు టీడీపీ పరిస్ధితి ఏమిటి ? వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గెలవాలంటే ఏమిటి మార్గం ?





జగన్ వ్యతిరేక పోరాటంలో చంద్రబాబు ఎక్కడ ఫెయిలయ్యారో అక్కడి నుండే ఎల్లోమీడియా మొదలుపెట్టింది. మహిళల మీద హత్యాచారాలని, మహిళలమీద దాడులని, దళితులపైన ధౌర్జన్యాలని నానా గోల మొదలుపెట్టింది. రుయా ఆసుపత్రిలో అబులెన్స్ లేక టూవీలపై కొడుకు డెడ్ బాడీని తీసుకెళ్ళటం, విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక స్ధితి సరిగాలేని అమ్మాయిపై అత్యాచారం ఘటనలను బాగా హైలైట్ చేయటం ఎల్లోమీడియా వ్యూహంలో భాగమే.





నిజానికి రెండు ఘటనలకు జగన్ కు ఏమి సంబంధం ? రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటన స్ధానికంగా అంబులెన్సుల మాఫియా వల్ల జరిగింది. ఈ మాఫియా చంద్రబాబు హయాంలో కూడా ఉంది. అప్పుడు జరిగిన ఘటనలు బయటపడకుండా మ్యానేజ్ చేశారు. అలాంటి ఘటనే ఇపుడు జరిగితే ఉద్దేశ్యపూర్వకంగా పెద్దది చేశారు. అలాగే విజయవాడ ఆసుప్రతిలో ఒక గదిలో యువతిపై అత్యాచారం చేస్తే బయట వాళ్ళకు ఎలా తెలుస్తుంది.


ఇక్కడ గమనించాల్సిందేమంటే యువతికి అత్యాచారం చేసిన ముగ్గురు యువకుల్లో ముందే పరిచయటం ఉండటం. యువతితో మాట్లాడటానికి వచ్చిన మహిళాకమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కేంద్రంగా టీడీపీ ఎంత గోల చేస్తోందో అందరు చూస్తున్నదే. కాబట్టి భవిష్యత్తులో టీడీపీ+ఎల్లోమీడియ  కలిసి మరింత గోల చేయటం ఖాయం. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండకపోతే జనాల్లో అప్రదిష్టపాలవ్వటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: