ఎప్పుడు మాట్లాడినా వాళ్ళమీద చర్యలు తీసుకుంటాను, వీళ్ళమీద తీసుకుంటాను, వాళ్ళని ఉపేక్షించేది లేదు, వీళ్ళని ఉపేక్షించేదిలేదు, కోవర్టులను సహించేదిలేదు, కోవర్టులను ఏరేస్తాను అని ఇప్పటికి ఎన్నోసార్లు చంద్రబాబునాయుడు వార్నింగులిచ్చుంటారు. కానీ ఎవరి మీదా ఇప్పటివరకు యాక్షన్ అన్నదే లేదు. దీనికి కారణం ఏమిటంటే ఎవరిమీద కూడా యాక్షన్ తీసుకునేంత సీన్ చంద్రబాబుకు లేదన్నది వాస్తవం.





ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి ప్రభుత్వాన్ని, పార్టీని లాక్కున్న దగ్గరనుండి ఇప్పటివరకు ఎవరిమీదా యాక్షన్ తీసుకున్నది లేదు. ఎవరిమీద యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో అన్న భయమే చంద్రబాబులో ఎక్కువ. పార్టీని దెబ్బకొడుతున్నారని తెలిసినా, ఫిర్యాదులు చేసినా కూడా ఎవరిమీద యాక్షన్ తీసుకోలేదు. మొన్నటి నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ నేతలు వైసీపీకి అనుకూలంగా పనిచేసినట్లు ఆధారాలతో సహా కొందరు తమ్ముళ్ళు చూపించారు.





అలాగే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కోవర్టులుగా ముద్రపడిన కొందరిని ఆధారాలతో సహా పార్టీలోని సీనియర్లు కొందరి పేర్లను చంద్రబాబుకు ఫిర్యాదుచేశారు. కుప్పం నేతలందరినీ పిలిచి మీటింగ్ పెట్టి కోవర్టులందరినీ ఏరేస్తానంటు పెద్దగా హూంకరించారు. అయితే ఇప్పటివరకు ఎవరిమీదా ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు. ఇదంతా ఇప్పుడెందుకంటే ఒక నియోజకవర్గ ఇన్చార్జి పక్క నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే సహించేదిలేదని వార్నింగ్ ఇచ్చారు.





చంద్రబాబు గురించి చాలామంది సీనియర్లకు బాగాతెలియటం వల్లే ఏమాత్రం లెక్కచేయటంలేదు. యధేచ్చగా తమిష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. నిజానికి గడచిన మూడేళ్ళుగా పార్టీలో యాక్టివ్ గా ఉన్న సీనియర్లే చాలా తక్కువ. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేకే వైసీపీతో గొడవలు ఎందుకని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ విషయం చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు. మూడేళ్ళుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేతలంతా ఇపుడే యాక్టివ్ అవుతున్నట్లు చెప్పారు. ఇదంతా చూసిన తర్వాత చంద్రబాబు వార్నింగులు ఇవ్వటమే కానీ ఎవరిమీదా యాక్షన్ తీసుకోలేరన్న విషయం అర్ధమైపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: