పార్టీ అయినా ప్లీనరీ పెట్టుకోవటం చాలా సహజం. రాజకీయ పార్టీలు ప్లీనరీని నిర్వహించుకునేందుకు నాలుగు కారణాలుంటాయి. మొదటిది తమ సత్తాను ప్రజలకు, ప్రత్యర్ధులకు చాటి చెప్పేందుకు. రెండోది ప్రత్యర్ధిపార్టీలపై మైండ్ గేమ్ ద్వారా పై చేయిసాధించేందుకు. ఇక మూడో కారణం ఏమిటంటే  తాము అధికారంలోకి వస్తే జనాలకు ఏమి చేస్తామో చెప్పేందుకు. అలాగే అధికార పార్టీవల్ల రాష్ట్రానికి, ప్రజలకు కలుగుతున్న నష్టాన్ని వివరించేందుకు.





ఇపుడు ఒంగోలులో జరిగిన తెలుగుదేశంపార్టీ మహానాడు టార్గెట్ రీచయ్యిందా ? అసలు మహానాడులో ఏమి జరిగింది ? అధికార వైసీపీతో పాటు ప్రత్యర్ధి పార్టీలపై మైండ్ గేమ్ తో పై చేయి సాధించిందా ? కార్యక్రమం జరిగిన తీరుచూస్తే గుండుసున్నా మాత్రమే కనబడుతుంది. ఎందుకంటే గడచిన మూడేళ్ళుగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా చేస్తున్న ఆరోపణలు, విమర్శలనే మరోసారి వినిపించారు. జగన్ మీద తనకున్న కసినంతా చంద్రబాబు మాటల ద్వారా తీర్చుకునే ప్రయత్నంచేశారు.






అలాగే పార్టీ నేతలు ప్రత్యేకించి గ్రీష్మ లాంటి వాళ్ళు మాట్లాడిన విధానం చాలా రోతగా ఉంది. మంత్రులు, నేతలను పట్టుకుని గ్రీష్మ కొడకల్లారా అనటం, ఈడ్చి ఈడ్చి కొడతామనటం, జగన్ కు వార్నింగిస్తు తొడకొట్టడం లాంటివి చూసిన తర్వాత చాలా అసహ్యంవేసింది. ప్రత్యర్ధులపైన ఆరోపణలు, విమర్శలు చేయటంలో తప్పులేదు కానీ దానికొక పద్దతుంటుంది. ఇలాంటి మాటలను మగవాళ్ళంటేనే సమాజం హర్షించదు. అలాంటిది ఒక మహిళా నేత మహానాడు వేదికగా మాట్లాడితే ఎలాగుంటుంది ? అసలు జనాలకు మహానాడు వేదిక ద్వారా టీడీపీ ఎలాంటి మెసేజ్ పంపాలని అనుకున్నదో అర్ధం కావటంలేదు.






ఇక తమకు అధికారం ఎందుకివ్వాలి ? అధికారం ఇస్తే ఏమి చేస్తామనే మాటలే లేవు. ఎంతసేపు గతంలో తాను సీఎంగా ఉన్నపుడు ఉమ్మడి రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేశాననే సోది తప్ప చంద్రబాబు ఇంకేమీ చెప్పలేదు. అచ్చెన్నాయుడు కూడా పార్టీకి 160 సీట్లు రాబోతున్నాయని చెప్పటం తప్ప ఏ పద్దతిలో వస్తుందో చెప్పలేదు. మొత్తంమీద జగన్ను తిట్టడానికే మహానాడు పెట్టుకున్నట్లుంది టీడీపీ.

మరింత సమాచారం తెలుసుకోండి: