సామాన్యులకు మరో భారీ షాక్.. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న జనాలకు ఇప్పుడు మరో బాదుడు..వంట గ్యాస్ ధరలు మళ్ళీ భారీగా పెరిగాయి.. ఇప్పటికే దశల వారీగా పెంచుతూ సామాన్యుడికి బండ భారాన్ని చేస్తున్న ప్రభుత్వాలు తాజాగా వంటగ్యాస్‌ కనెక్షన్‌ డిపాజిట్‌ ను అమాంతంగా పెంచాయి. ఇప్పటివరకు రూ.1450 ఉన్న కొత్త కనెక్షన్‌ రూ.1750కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన కొత్త కనెక్షన్‌ ధరల ను గురువారం నుంచి అమలు లోకి రానున్నాయి. ఇప్పటివరకు 14.2 కేజీల బరువు ఉన్న సిలిండర్‌, కొత్త కనెక్షన్‌ కావాలంటే రూ.1450 డిపాజిట్‌ చేయాలి. గ్యాస్‌తో కలిపి కొత్త కనెక్షన్‌ తీసుకోవాలంటే రూ.2,650ను చెల్లించాలి.


అయితే పెరిగిన కొత్త ధరల ప్రకారం అదే బరువు కలిగిన కొత్త కనెక్షన్‌ తీసుకోవాలంటే రూ.1750 డిపాజిట్‌ చేయాలి. గ్యాస్‌, రెగ్యులేటర్‌తో కలిపితే రూ.3,300 ప్రస్తుతం చెల్లించాల్సి వస్తుంది. మొత్తం మీద కొత్త కనెక్షన్‌ డిపాజిట్‌ సామాన్యుడి కి మరింత భారంగా మారనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సుమారు లక్షకు పైగా కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేస్తుండగా 50 నుంచి 70 వేల వరకూ మాత్రమే కనెక్షన్స్ ను అధికారులు ఇస్తున్నారు..


ప్రజలపై కొత్త కనెక్షన్‌ భారం మరింత పెరగనుంది. ఒక్కొక్క కనెక్షన్‌పై రూ.300 నుంచి రూ.450 వరకు అదనపు భారం పడనుంది. ఇప్పటికే గ్యాస్‌ ధరలు అమాంతంగా పెరగడంతో పేద ప్రజలు గ్యాస్‌పై వంట చేయాలంటనే భయపడి పోతున్నారు. రూ.550 ఉన్న గ్యాస్‌ ధర దశల వారీగా రూ.1050కు చేరింది. తాజాగా కొత్త కనెక్షన్‌ ధరల ను కూడా భారీగా పెంచేయడంతో పేద ప్రజలు గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటేనే వెనుకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది..ఈ విషయం పై ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జూలై లో ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: