ఇంత కాలానికి సీపీఐ నేత కంకణాల నారాయణ అలియాస్ చికెన్ నారాయణ లెక్క కుదిరింది. ప్రత్యర్దులపై ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకోవటం ఈయనక బాగా అలవాటు. ఆరోపణలు, విమర్శలు  చేసేటపుడు సమయం, సందర్భంతో పాటు అవతలి వాళ్ళు ఎవరనేది కూడా చూడరు. బుర్రకు ఎంతతోస్తే అంత, నోటికి ఎంతొస్తే అంత అనేయటమే ఈయనకు అలవాటు లేదా వీక్ నెస్ అని కూడా అనుకోవచ్చు.






ఇంతకాలం నారాయణ ఎవరిపైన ఏమి కామెంట్ చేసినా, ఆరోపణలు చేసినా చెల్లిపోయింది. కానీ మొదటిసారి తన మాటలను వెనక్కు తీసుకుని సారి చెప్పుకోవాల్సొచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్య భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా పెద్ద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. దాన్ని ఆవిష్కరించేందుకు నరేంద్రమోడీ వచ్చారు. ఈ సందర్భంగా వేదికపై మోడీతో పాటు జగన్మోహన్ రెడ్డి, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అద్యక్షుడు సోమువీర్రాజుతో పాటు మెగాస్టార్ చిరింజీవి కూడా ఉన్నారు.





కార్యక్రమం జరిగి రెండువారాలైపోయింది. అలాంటిది ఇపుడే నారాయణకు ఎందుకు గుర్తుకొచ్చిందే ఏమో. బుర్రకు తోచిన వెంటనే బయటకు కక్కేయకపోతే ఆయనకు నిద్రపట్టదులాగుంది. అందుకనే అర్జంటుగా మీడియాతో మాట్లాడుతు చిరంజీవిని పట్టుకుని చిల్లర బేరగాడు అంటు రెచ్చిపోయారు. సీతారామరాజు సినిమా హీరో కృష్ణను కార్యక్రమానికి పిలవకుండా చిల్లర బేరగాడు చిరంజీవిని పిలవటం ఏమిటంటు నోటికొచ్చింది మాట్లాడారు.





కృష్ణను పిలవలేదేమని అడగటంలో తప్పులేదు. కానీ చిరంజీవిని పట్టుకుని చిల్లర బేరగాడని అనటంలో అర్ధంలేదు. అసలిక్కడ చిల్లరబేరగాడని మెగాస్టార్ ని అనాల్సిన అవసరం ఏమిటో కూడా అర్ధంకావటంలేదు. దాంతో మెగా అభిమానులు నారాయణను గట్టిగా అంటుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శించేందుకు కోనసీమకు వెళ్ళినపుడు చిరంజీవి అభిమానులు బూతులుతిడుతు నారాయణ వెంటపడ్డారు. వాళ్ళడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక చిరంజీవికి సారి చెప్పారు. తాను నోరుజారి చిరంజీవిని అనవసరంగా అన్నట్లు చెంపలేసుకున్నారు. బురదలోకి రాయేస్తే తిరిగి ఆ చిందులు మనపైనే పడుతుందన్న కనీస ఇంగితం కూడా నారాయణకు లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: