మీడియా సమావేశంలో కేసీయార్ మాటలువింటుంటే అందరికీ ఇవేఅనుమానాలు మొదలయ్యాయి. వాస్తవానికి నరేంద్రమోడీని ఏ ఏ అంశాల్లో అయితే ఆక్షేపిస్తున్నారో ? మోడీపైన ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ కేసీయార్ కు కూడా వర్తిస్తాయనటంలో సందేహమేలేదు. నరేంద్రమోడీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటు మండిపడ్డారు. మరి కేసీయార్ ఏమన్నా ప్రజాస్వామ్యయుతంగా పాలనచేస్తున్నారా ?






అన్నీ పార్టీలను చంపేసి ఏకపార్టీస్వామ్యాన్ని తీసుకురావాలని మోడీ ప్రయత్నిస్తున్నరంటు మరో ఆరోపణ చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్, టీడీపీలను కేసీయార్ చేస్తున్నదేమిటి ? కాంగ్రెస్, టీడీపీ ఎంఎల్ఏలను ఒత్తిళ్ళకు గురిచేసి, ప్రలోభాలుపెట్టి టీఆర్ఎస్ లోకి లాగేసుకోలేదా ? ప్రతిపక్షాల గొంతును మోడి నలిపేస్తున్నారంటున్న కేసీయార్ రాష్ట్రంలో తాను చేస్తున్నది అదేకదా. దేశాన్ని అప్పులుపాలు చేసేస్తున్నారంటు గోలచేస్తున్న కేసీయార్ హయాంలో తెలంగాణా 4 లక్షల కోట్లరూపాయల అప్పుచేయలేదా ?





కాబట్టి మోడీపై కేసీయార్ చేసిన ఆరోపణల్లో దేనిలో కూడా పసలేదని అందరికీ తెలుసు. కాకపోతే టీఆర్ఎస్ నుండి కొందరు నేతలను లాగేసుకుని బీజేపీలో చేర్చుకోవటాన్నే కేసీయార్ తట్టుకోలేకపోతున్నట్లున్నారు. తాను ఇతర పార్టీల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో అదే పద్దతిని కేసీయార్ విషయంలో బీజేపీ అమలుచేస్తోంది. దీంతో కేసీయార్ కు మంట బాగా పెరిగిపోతున్నట్లుంది. తాను 2014కి ముందు ఊ అంటే రాజీనామాలు చేయటం, తన ఎంఎల్ఏతో రాజీనామాలు చేయించి ఉపఎన్నికలు తెప్పించేవారు.






తెలంగాణాసెంటిమెంటు జనాల్లో బలంగాఉందని చాటేందుకు ఉపఎన్నికలను అస్త్రంగా వాడుకున్నారు. ఇపుడు కేసీయార్ మీద జనాల్లో బాగా వ్యతిరేకత వచ్చేసిందని చెబుతున్న బీజేపీ అదే రాజీనామాలను, ఉపఎన్నికలను అస్త్రంగా ప్రయోగిస్తోంది. నాలుగు ఉపఎన్నికలు జరిగితే రెండింటిలో బీజేపీ గెలిచింది. మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ రంగం రెడీచేస్తోంది. బహుశా దీన్ని కేసీయార్ తట్టుకోలేకపోతున్నట్లున్నారు. మునుగోడులో ఓడిపోతే కేసీయార్ కు ఇబ్బందులు తప్పేట్లులేదు. అందుకనే మునుగోడు ఉపఎన్నికా లేకపోతే ముందస్తు ఎన్నికలా అని కేసీయార్ ఆలోచిస్తున్నారనే ప్రచారాన్ని కూడా బీజేపీ నుండే మొదలైంది. అంటే కేసీయార్ పై బీజేపీ మైండ్ గేమ్ బాగానే వర్కవుటవుతోందనే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: