భారతదేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి ఎంత చరిత్ర ఉందో తెలిసిందే. అయితే గత రెండు పర్యాయాలుగా దేశంలో కాంగ్రెస్ పాలన లేదు. బీజేపీ సంయుత పార్టీలు అన్నీ కలిసి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఇలా కాంగ్రెస్ విఫలం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి నాయకత్వ లోపం. సోనియా గాంధీ తర్వాత సరైన నాయకుడు లేకపోవడం ప్రజల్లో నమ్మకం కలగడం లేదు. అందుకే కాంగ్రెస్ సరైన అధ్యక్షుడిని ఎన్నుకునే పనిలో ఉన్నారు.. ఇదిలా ఉండగా పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండి కేంద్రమంత్రిగా చేసిన జమ్మూకాశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ కొద్దికాలం క్రిందట పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు.

తాజాగా ఈయన కొత్త పార్టీ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా ఈ విషయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు తెరలేపింది. ఇదిలా ఉంటే పార్టీ పెట్టబోతున్న ఆజాద్ సక్సెస్ గురించి కూడా హాట్ హాట్ గా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు పార్టీ పెడుతున్న ఆజాద్ సక్సెస్ అవ్వరు అనే ఎక్కువ మందు అనుకుంటున్నారట.

దీనికి కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు. మాములుగా ఏ రాజకీయ నాయకుడైనా పార్టీ వయసు అయిపోయాక పెట్టరు. ఒకవేళ పెట్టినా పెద్దగా సక్సెస్ కాదు. నిరంతరం ప్రజలతో ఉండేందుకు ఆజాద్ వయసు రీత్యా సహకరించదు. అందుకే చాలా మంది పార్టీ పెట్టకపోవడమే మంచిది అంటున్నారు. పైగా జమ్మూకాశ్మీర్ లో ఉన్న ప్రజలు పెద్దగా అటాచ్ లో లేరని చెప్పాలి. ఇప్పటి వరకు తన సొంత రాష్ట్రము కోసం పెద్దగా చేసింది ఏమీ లేదు. పైగా ఇప్పుడు జమ్మూకాశ్మీర్ లో ఉన్న పండిట్ ల కోసం హామీలను ఇచ్చేస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రి గా ఉన్నప్పుడే రాష్ట్రానికి ఏమీ చేయలేదు, ఇప్పుడేమి చేస్తారు అన్న వారు లేకపోలేదు. ఇన్ని ప్రతికూలతలు ఉండగా ఆజాద్ పార్టీ పెట్టి సక్సెస్ అవుతారా చూడాలి.     

మరింత సమాచారం తెలుసుకోండి: