వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలది కాన్ఫిడెన్సో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సో అర్ధం కావటంలేదు. తెలంగాణా రాజకీయాల్లో ప్రవేశించాలని డిసైడ్ చేసుకున్నప్పటనుండి కేసీయార్ తో పాటు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కేసీయార్ పాలనలో లోటుపాట్లను, అవినీతి జరిగిందని నానా రచ్చ చేస్తున్నారు. అయితే తెలంగాణాకు నరేంద్రమోడీ సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించటంలేదు.





తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతు తానింకా అసెంబ్లీలోకి ప్రవేశించకముందే మంత్రులు, టీఆర్ఎస్ ఎంఎల్ఏలకు తనంటే భయం పట్టుకుందని ఎగతాళిగా మాట్లాడారు. తనపై మంత్రులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరకు స్కూలు పిల్లలు వెళ్ళి హెడ్ మాస్టర్ తో కంప్లైంట్ చేసినట్లే ఫిర్యాదు చేశారని ఎద్దేవా చేశారు. ఇక్కడే ఆమెది ఓవర్ కాన్పిడెన్స్ అని అర్ధమైపోతోంది. తానింకా అసెంబ్లీలోకి అడుగుపెట్టకముందే తనంటే మంత్రులు, ఎంఎల్ఏలు భపడిపోతున్నట్లు తనను తాను చాలా ఓవర్ గా ఊహించుకుంటున్నారని అర్ధమవుతోంది. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనను గెలిపించేస్తారని అనుకుంటున్నట్లున్నారు. ఆమె గెలిస్తే మరి పార్టీ సంగతి ఏమిటి ?





అసలు షర్మిల అసెంబ్లీకి అడుగుపెడితే మిగిలిన వాళ్ళు ఎందుకు భయపడిపోతారు ? తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టగానే టీఆర్ఎస్ మంత్రులు, ఎంఎల్ఏలు సభను వదిలేసి బయటకు పారిపోతారని షర్మిల అనుకుంటున్నారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. షర్మిల లాంటివాళ్ళని అసెంబ్లీ గతంలో చాలామందిని చూసింది. భవిష్యత్తులో కూడా ఇంకా ఎంతోమందిని చూస్తుంది. ఇంతోటిదానికి షర్మిల తను లార్జర్ దేన్ ది లైఫ్ అన్న పద్దతిలో తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటున్నట్లున్నారు.





అసలు వచ్చే ఎన్నికల్లో పోటీచేసి గెలిచినప్పటి సంగతి కదా ? ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ ఎన్నికలో పోటీచేస్తానని ప్రకటించారు. ముందు ఆమె గెలవాలి. ఒకవేళ గెలిచి అసెంబ్లీకి వచ్చినా టీఆర్ఎస్ వాళ్ళని ఆమె చేయగలిగేదేముంటుంది ? ఆమె గెలుపే ఖాయంలేదు అలాంటిది ఆమె పార్టీ తరపున ఇంకెవరు గెలుస్తారు ? సింగిల్ ఎంఎల్ఏ సభలోకి ప్రవేశించినా ఆమె చేయగలిగేది కూడా ఏమీ ఉండదు. కాబట్టి అనవసరమైన మాటలు కట్టిబెట్టి జరగాల్సింది చూస్తే అందరికీ మంచిదని జనాలంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: