క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. చంద్రబాబునాయుడే కాదు చివరకు ఎల్లోమీడియాకు కూడా జగన్మోహన్ రెడ్డే ఎజెండాను సెట్ చేసినట్లున్నారు. జగన్ మూడు రాజధానులంటే చంద్రబాబు, ఎల్లోమీడియా వెంటనే మూడు రాజధానులకు వ్యతిరేకంగా గోలచేస్తున్నారు. ఒకపుడు ఇంగ్లీషుమీడియం స్కూళ్ళని జగన్ అనగానే ఇదే చంద్రబాబు, ఎల్లోమీడియా నానా గోల గోల చేసేసింది.





ఇపుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా జగన్ ప్రత్యేకహోదా అనగానే వెంటనే చంద్రబాబు రెండుమూడుసార్లు యూటర్నులు తీసుకుని చివరకు ఎల్లోమీడియా సాయంతో హోదాపైనే రచ్చ మొదలుపెట్టారు. కుప్పంలో చంద్రబాబును ఓడించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు జగన్ చెప్పగానే పోలోమంటు చంద్రబాబు రెగ్యులర్ గా కుప్పంలో పర్యటిస్తున్నారు. దశాబ్దాల కాలంలో కుప్పంకు చంద్రబాబు ఏడాదికి ఒకసారే లేకపోతే రెండుసార్లో వెళితే అదేగొప్పగా ఉండేది. కానీ ఇపుడు ప్రతి రెండునెలలకు మూడు రోజులు కుప్పంలోనే క్యాంపేస్తున్నారు.





పోలవరం ప్రాజెక్టుపై జగన్ సమీక్ష అనగానే వెంటనే చంద్రబాబు, ఎల్లోమీడియా పోలవరం గురించి రచ్చ చేస్తున్నారు. ప్రాజెక్టును నిర్మించటంలో జగన్ ఫెయిలయ్యారంటు కథనాలు, వార్తలు విపరీతంగా అచ్చేస్తున్నారు. తనను చంద్రబాబు, ఎల్లోమీడియా బాగా విమర్శించాలని, ఆరోపణలు చేయాలని బహుశా జగన్ కూడా కోరుకుంటున్నట్లున్నారు. అందుకనే ఎక్కడ బహిరంగసభ జరిగినా చంద్రబాబు, ఎల్లోమీడియా+పవన్ కల్యాణ్ణను కలిపి దుష్టచతుష్టయంగా పోల్చుతున్నారు. దాంతో రెచ్చిపోయి ఎల్లోమీడియా ఎప్పుడెప్పడిదే జగన్ వ్యతిరేక డెవలప్మెంట్లను తవ్వి తీసి మరీ అచ్చేస్తున్నాయి.





మార్గదర్శి చిట్ ఫండ్స్ ఫ్రాడ్ కేసులో రామోజీరావుకు వ్యతిరేక కేసులో ప్రభుత్వం ఇంప్లీడ్ అవ్వగానే జగన్ కు వ్యతిరేకంగా రామోజీరావు రెచ్చిపోయి మరీ వార్తలు అందిస్తోంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే జగన్ అంటేనే ఎల్లోమీడియా ఉన్నవీ లేనివీ అన్నీ కల్పించి రాస్తుంటాయనే భావననను జనాల్లో కల్పించటంలో జగన్ సక్సెస్ అయ్యారు. అంటే చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియాకు కూడా జగన్ జనాల్లో విశ్వసనీయత లేకుండా చేశారు. ఎందుకంటే 24 గంటలూ 365 రోజులూ జగన్ కు నెగిటివ్ గా మాత్రమే వార్తలు, కథనాలు ఇస్తుంటే జనాలు మాత్రం ఎంతకాలమని చదువుతారు ? నమ్ముతారు ?

మరింత సమాచారం తెలుసుకోండి: