కాంగ్రెస్ అద్యక్షురాలు సోనియాగాంధీ చాలా స్పీడుగా పావులు కదిపారా ? అధ్యక్ష పదవికి ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ట్విస్టులను చూసిన తర్వాత ఈ విషయం స్పష్టమవుతోంది. రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాటే మొదట్లో సోనియా ఛాయిస్ అని అందరికీ తెలిసిందే. అయేతే చేసిన ఓవర్ యాక్షన్, వేసుకున్న సెల్ఫ్ గోల్ కారణంగా గెహ్లాట్ తన నెత్తిన తానే చెత్తవేసుకున్నారు. దాంతో గెహ్లాట్ స్ధానంలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో సోనియా చాలా స్పీడుగానే పావులు కదిపారు.





అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న ఎవరికీ డైరెక్టుగా సోనియా మద్దతుండదు. కానీ పోటీచేసే వాళ్ళని బట్టే అందరికీ అర్ధమైపోతుంది. సో సోనియా ఆశీస్సులు మల్లికార్జునఖర్గేకే అని అందరికీ తెలిసిపోయింది. ఖర్గేని రంగంలోకి దింపేముందు వ్యూహాత్మకంగా దిగ్విజయ్ సింగ్ పేరు ప్రచారంలోకి వచ్చింది. దాంతో నేతలందరి దృష్టి శశిథరూర్ తో పాటు సింగ్ మీదకు మళ్ళింది.



 

శుక్రవారం నామినేషన్లు వేయటానికి చివరిరోజు అనగా ఉదయం హఠాత్తుగా ఖర్గే పేరు బయటకు వచ్చింది. అంటే పైకి దిగ్విజయ్ పేరును చూపిస్తునే తెరవెనుక ఖర్గేని సోనియా రెడీ చేసినట్లు అర్ధమైపోతోంది. ఒకసారి ఖర్గేకే సోనియా ఆశీస్సలున్న విషయం బయటపడిన తర్వాత ఇక థరూర్ కు పెద్దగా ఓట్లుపడే అవకాశాలు లేవనే చెప్పాలి. మొదట్లో దక్షిణాది వర్సెస్ ఉత్తరాధికే పోటీ అన్న కలరింగ్ మొదలైంది. దిగ్విజయ్ ఉత్తరాధి, థరూర్ దక్షిణాదన్న విషయం తెలిసిందే.



 


అయితే ఊహించని రీతిలో చివరినిముషంలో కర్నాటకకు చెందిన ఖర్గే సీన్లోకి ఎంటరవ్వటంతో దక్షిణాది ఓట్లలోనే చీలిక రావటం+ఉత్తరాధి ఓట్లల్లో అత్యధికం ఖర్గేకి పడే అవకాశం ఉందనే అంచనాలు మొదలయ్యాయి. దాంతో ఖర్గే గెలుపు దాదాపు ఖాయమైనట్లే అనే ప్రచారం మొదలైపోయింది. మొత్తానికి సోనియా కూడా పావులను చాలా స్పీడుగా కదపగలరు అనే విషయం బయటపడింది. థరూర్ కన్నా ఖర్గేనే సోనియా కుటుంబానికి అత్యంత నమ్మకస్తులన్న విషయం అందరికీ తెలిసిందే.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: