జనాల బద్ధకం కొందరికి ఉద్యోగంగా మారింది..అందులో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా ఉన్నాయి..చాలా మంది డెలివరీ బాయ్ లుగా పని చేస్తున్నారు..పెద్ద పెద్ద టవున్ లలో ఫుడ్ డెలివరీ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది.ఎన్ని వున్న కూడా మన దేశంలో నిరుద్యోగులకు కొరత లేదు..రోజు రోజుకూ నిరుద్యోగులు పెరిగి పోతున్నారు. డిగ్రీలు, పీజీలు చదివినా చిన్న ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్లొస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో నిరుద్యోగులకు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో గుడ్ న్యూస్ అందించింది...


రూ.2.94 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలను కల్పిస్తోంది. వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేయొచ్చని తెలిపింది. చాట్ ప్రాసెస్ పొజిషన్‌ను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.కస్టమర్ సపోర్ట్‌లోని ఉద్యోగులు జొమాటోలో చాట్ ప్రాసెసింగ్ ఉద్యోగంలో పని చేయాల్సి ఉంటుంది. యూజర్లు అడిగే ప్రశ్నలకు ప్రతిస్పందించి, వారి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఫుడ్ డెలివరీ సర్వీస్ అయిన జొమాటో, కస్టమర్ సపోర్ట్ చాట్ ప్రాసెస్ కోసం ఉద్యోగ అవకాశాలను పోస్ట్ చేసింది. డిగ్రీ పూర్తి చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జొమాటోలో ఉద్యోగాల కోసం ఆసక్తి గల అభ్యర్థులు zomato.com/careersలో వెబ్‌సైట్‌లో చూడవచ్చు.


ఇంటి నుండి పని కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులకు వారి రెజ్యూమ్‌లను పంపాల్సి ఉంటుంది. కస్టమర్ సర్వీస్‌లోని ఉద్యోగులు చాట్ ప్రాసెసింగ్ జాబ్ రకం జొమాటో కస్టమర్‌ల ప్రశ్నలకు ప్రతిస్పందించాలి. వారి సమస్యలను పరిష్కరించాలి. కస్టమర్ సపోర్ట్ పొజిషన్‌ల కోసం నియమితులైన వారికి ఏటా రూ.2,94,000ల జీతం లభిస్తుంది. టైపింగ్ నైపుణ్యం ఉండాలి. కస్టమర్లతో చక్కగా సంభాషించాలి. వారి సమస్యను తెలుసుకుని పరిష్కారం అందించాలి. జొమాటో కంపెనీ కెరీర్ పేజీలో నేరుగా ఈ స్థానానికి దరఖాస్తు చేయడం సాధ్యం కాదు. అందువల్ల, ఉద్యోగార్ధులు సూచనలను స్వీకరించడానికి జొమాటో ఉద్యోగులను సంప్రదించవచ్చు..మంచి జీతం తో పాటు పని కూడా బాగుంటుందని నిపుణులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: