తొందరలోనే తెలుగుదేశంపార్టీ నుండి పెద్ద వికెట్ ఒకటి ఔట్ అయిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబంలో రెండు టికెట్లు ఇచ్చే విషయమై చంద్రబాబునాయుడు ఏమీ తేల్చి చెప్పకపోవటంతో సదరు సీనియర్ నేత బాగా విసిగిపోయారట. పైగా తమకు టికెట్లు ఇస్తారనే నమ్మకం కూడా కోల్పోయారట. అందుకనే ప్రత్యామ్నయాన్ని చూసుకునే పనిలో బిజీగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.





ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా తనకు, సత్తెనపల్లి ఎంఎల్ఏగా తన కొడుకు రంగారావుకు టికెట్లు ఇవ్వాలని మాజీఎంపీ రాయపాటి సాంబశివరావు చాలాకాలంగా చంద్రబాబునాయుడుపై ఒత్తిడి పెడుతున్నారు. అయితే అధినేతేమో ఏ విషయమూ తేల్చటంలేదు. సీనియర్ల కుటుంబాల్లో ఎవరికీ రెండో టికెట్ ఇవ్వకూడదని చంద్రబాబు ఒక ఫార్ములా పెట్టుకున్నారు. దాని ప్రకారం చూస్తే తండ్రి, కొడుకుల్లో ఎవరో ఒకరికే టికెట్ దక్కుతుంది.





నరసరావుపేట ఎంపీగా యనలమ రామకృష్ణుడు అల్లుడు పోటీచేసేందుకు రెడీ అయిపోయారట. కాబట్టి చంద్రబాబు యనమల అల్లుడుకే ప్రయారిటి ఇచ్చే అవకాశముంది. కాబట్టి రాయపాటికి ఎంపీ టికెట్ దాదాపు లేనట్లే. ఇక సత్తెనపల్లిలో రంగారావుతో పాటు మరో నలుగురు సీనియర్ నేతలు గట్టిగా పోటీపడుతున్నారు. చంద్రబాబు వాలకం చూస్తుంటే రంగారావుకు టికెట్ ఇచ్చేది అనుమానంగానే ఉందని రాయపాటికి అర్ధమైందట. అందుకనే వైసీపీలోకి ఎలాగూ పోలేరు కాబట్టి ప్రత్యామ్నాయంగా బీజేపీని చూసుకున్నారట.





తామిద్దరికీ టికెట్లిస్తే బీజేపీలోకి చేరుతామనే ప్రతిపాదన పంపారట రాయపాటి. ఇక్కడ విషయం ఏమిటంటే బీజేపీకి గట్టి అభ్యర్ధులు లేరు, ఎంపీగా పోటీచేస్తామని అడిగేంత ఆర్ధికస్తోమత ఉన్నవాళ్ళూ అన్నోచోట్లా లేరు. కాబట్టి రాయపాటి లాంటి నేతల ప్రతిపాదనను తిరస్కరించే అవకాశంలేదు. కాబట్టి ఈ మాజీ ఎంపీ ప్రతిపాదన తొందరలోనే వర్కవుటవుతుందనే అనుకుంటున్నారు. అదే జరిగితే తండ్రి, కొడుకులు టీడీపీకి గుడ్ బై చెప్పేసి కమలం కండువా కప్పుకోవటం ఖాయం. అప్పుడు టీడీపీకి పెద్ద షాకనే చెప్పాలి. ఎందుకంటే ఇపుడు రాయపాటికి అనారోగ్యం సరిగా లేకపోయినా ఆర్ధికంగా చాలా గట్టి స్ధితిలోనే ఉన్నారు. అలాంటి నేత పార్టీని వదిలేయటమంటే దెబ్బే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: