పెన్షన్ పొందేవాల్లకు బ్యాంకులు కొన్ని ఆఫర్లను అందిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో ఫెసిలిటీస్ను అందించిన సంగతి తెలిసిందే..లైఫ్ సర్టిఫికెట్ పొందేవారికి మాత్రం బ్యాంకు ఆఫ్ బరోడా ఒక గుడ్ న్యూస్ ను చెప్పింది..పెన్షర్ల కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్త సేవలను తీసుకొచ్చింది. ఇకపై పింఛనను దారులు లైఫ్‌ సర్టిఫికేట్‌ ను సమర్పించడానికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి నుంచే సమర్పించే అవకాశాన్ని క్పలించింది.. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..



బ్యాంకుకు వెళ్లలేని సీనియర్‌ సిటీజన్ల కోసం వీడియోకాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ సబ్‌మిట్ చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ విషయాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే గతేడాది ఎస్‌బీఐ ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇంతకీ ఈ సేవలను ఎలా వినియోగించుకోవాలంటే.. వినియోగదారులు ఇందుకోసం ముందుగా పెన్షన్‌ సార్థి పోర్టల్‌లోకి లాగిన్‌ అవ్వాలి. అనంతరం వీడియో బేస్డ్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి. తర్వత పెన్షన్‌ చెల్లిస్తున్న బ్రాంచీ తో రిజిస్టర్‌ చేసుకున్న పీపీఓ నంబరు, ఖాతా నంబరు ఎంటర్‌ చేయాలి. రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుంది.తర్వాత అవసరమైన కొన్ని వివరాలను ఇవ్వాలి. 



ఆ తర్వాత వీడియో కాల్ చేసే సమయాన్ని ఎంచుకోవాలి. అనంతరం బ్యాంకు అధికారిక వీడియో కాల్ చేయగానే మీ ఫోటో ఐడీ కార్డును బ్యాంకు అధికారికి చూపిస్తే, ఆ అధికారి కార్డును క్యాప్చర్‌ చేస్తారు. ఆ తర్వాత వివరాల నమోదు కోసం పెన్షనర్‌ స్క్రీన్‌పై ప్రశ్నా పత్రం కనిపిస్తుంది. ఫొటో లను క్యాప్చర్‌ చేసిన తర్వాత ఆధార్‌ రిజిస్టర్‌ మొబైలన్‌ నెంబర్‌ కు వచ్చిన ఓటీపీని బ్యాంకి అధికారికి చెప్పాలి. ఇదంతా పూర్తయిన తర్వాత లైఫ్‌ సర్టిఫికెట్‌ పెన్షన్‌ సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్‌ అవుతుంది..దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్థున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: