ప్రభుత్వ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను అందిస్తూ వస్తుంది..ఇప్పటికే ఎన్నో భీమా పాలసీలను అందుబాటులో ఉంచింది..వాటికి మంచి డిమాండ్ ఏర్పడింది..ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్, ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ ప్రకటించింది. అందులో ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్ బెనిఫిట్స్ చూస్తే కేవలం రూ.6,000 లోపు ప్రీమియంతో రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ పొందొచ్చు. మరి ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాము..


ఆ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ..ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్, ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ ప్రకటించింది. వీటిలో ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్ బెనిఫిట్స్ చూస్తే కేవలం రూ.6,000 లోపు ప్రీమియంతో రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ పొందొచ్చు. మరి ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాము..


ప్లాన్‌ను 18 నుంచి 65 ఏళ్ల లోపు ఉన్న వారు ఎవరైనా తీసుకోవచ్చు. మెచ్యూరిటీ వయస్సు 80 ఏళ్ల లోపే ఉంటుంది. కనీస సమ్ అష్యూర్డ్ రూ.25,00,000. గరిష్టంగా ఎంత మొత్తానికైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ 10 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్స్ ఉంటాయి. రెగ్యులర్ ప్రీమియంలో పాలసీ టర్మ్ మొత్తం ప్రీమియం చెల్లించాలి. లిమిటెడ్ ప్రీమియంలో పాలసీ టర్మ్ కన్నా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల ముందు వరకు ప్రీమియం చెల్లించాలి...
ఒక వ్యక్తికి 20 ఏళ్ళు వుంటే ఆప్షన్ 1 ఎంచుకొని 20 ఏళ్ల పాలసీ టర్మ్‌తో రూ.50 లక్షలకు టర్మ్ ఈ పాలసీ తీసుకున్నారనుకుందాం. రెగ్యులర్ ప్రీమియం అయితే ఏడాదికి రూ.5,959 + జీఎస్‌టీ చెల్లించాలి.


ఇక సింగిల్ ప్రీమియం అయితే రూ.57,768 + జీఎస్‌టీ చెల్లిస్తే చాలు. అతనికి 20 ఏళ్ల పాటు రూ.50 లక్షల కవరేజీ లభిస్తుంది..సడెన్ గా ఓ ఆ పాలసీ దారుడు చనిపోతే ఆ డబ్బులు అతని కుటుంబానికి ఇస్తారు.ఆప్షన్ 2 ఎంచుకున్నవారికి సమ్ అష్యూర్డ్ పెరుగుతూ ఉంటుంది. పైన చెప్పిన ఉదాహరణ ప్రకారం లెక్కేస్తే రూ.7,832 + జీఎస్‌టీ ప్రీమియం చెల్లించాలి. సింగిల్ ప్రీమియం అయితే రూ.1,14,187 + జీఎస్‌టీ చెల్లించాలి. పాలసీ 5 ఏళ్లు ముగిసిన తర్వాత ప్రతీ ఏటా 10 శాతం చొప్పున సమ్ అష్యూర్డ్ పెరుగుతుంది. 15వ ప్రీమియం చెల్లించేనాటికి సమ్ అష్యూర్డ్ రెట్టింపు అవుతుంది.అంటే కోటి వరకూ వస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: