రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. అయితే రేషన్ కార్డు ను సంవత్సరం వరకు దాన్ని ఉపయోగించకుండా ఉన్నారా.. అయితే మీరు ఇబ్బందుల్లో పడ్డట్లే. ఎందుకంటే ఏడాది అంతకంటే ఎక్కువ రోజులు ఉపయోగించని రేషన్ కార్డులను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది... మీకోసమే ఈ వార్త ప్రస్తుతం ఢిల్లీ సర్కార్ ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. చాలా కాలంగా రేషన్ తీసుకోని వ్యక్తుల రేషన్ కార్డులను రద్దు చేయనుంది. రాష్ట్ర పౌరసరఫల శాఖ.. జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికి వెరిఫికేషన్ చేసి నివేదికను ప్రభుత్వానికి పంపాలని కోరింది. అనంతరం ఆయా రేషన్ కార్డులను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.


అర్హులైన వారికి రేషన్ ప్రయోజనాలు అందించడంతో పాటు.. ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో.. వారిని సైతం ఈ పధకంలోకి చేర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ సర్కార్ చెబుతోంది. మరోవైపు రేషన్‌ను సద్వినియోగం చేసుకోని వారు రెండు లక్షల మందికి పైగా ఉన్నట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఏడాది కాలంగా రేషన్ తీసుకోని లేదా ఒకట్రెండు సార్లు మాత్రమే రేషన్ తీసుకున్న వారి డేటాను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అలాంటి వారిని ఆహార సరఫరా శాఖ అధికారులు రేషన్ తీసుకోకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకోనున్నారు..


సరైనదని తేలితేనే, పేరును జాబితాలో ఉంచుతారు. లేదా రేషన్ కార్డును రద్దు చేయడం ఖాయం. ఇందుకోసం అధికారులు ఇంటింటి వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు.. ఇది ఇలా వుండగా ఇప్పటివరకు..ఢిల్లీ ప్రభుత్వం 17.83 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు జారీ చేసింది. 2021 సెప్టెంబర్‌ నుంచి 2022 అక్టోబర్‌ వరకు రేషన్‌ తీసుకోని వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవలే కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.. అందులో భాగంగా వారి ఇంటికి వెళ్లి అధికారులు రేషన్ కార్డు వెరిఫికేషన్‌ను కొనసాగిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: