చూస్తుంటే కేసీయార్ స్పీడుకు బ్రేకేలు పడినట్లే ఉంది. ఏడు రాష్ట్రాల్లో ఈనెలాఖరుకల్లా కిసాన్ సెల్లులు వేయాలని, పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేయాలని, దేశమంతా టూర్ చేయాలని కేసీయార్ టార్గెట్లు పెట్టుకున్నారు. అయితే ఎంఎల్ఏల కొనుగోలు విచారణకు సంబంధించి హైకోర్టు తాజా ఆదేశాలు అన్నింటికీ బ్రేకులు వేసినట్లే ఉంది. ఎంఎల్ఏల కొనుగోలు విచారణకు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

సిట్ ద్వారా నిందుతులతో పాటు బీజేపీలోని కీలకవ్యక్తులకు నోటీసులు వెళుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కూతురు కవిత విచారణను బ్యాలెన్స్ చేయటానికే కేసీయార్ సిట్ ఏర్పాటుచేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే కేసీయార్ ఊహించని విధంగా హైకోర్టు సిట్ దర్యాప్తును రద్దుచేసింది. అంతేకాకుండా నిందితులు, బీజేపీ నేతలు అడిగినట్లు సీబీఐ విచారణకు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో కేసీయార్ కు షాక్ కొట్టినట్లయ్యింది.

ఒకవైపు సీబీఐ విచారణకు కోర్టు ఆదేశాలివ్వటం, మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూతురు కవితను పదేపదే విచారణకు పిలుస్తుండటం, మరోవైపు చంద్రబాబునాయుడు తెలంగాణాలో యాక్టివ్ అవుతుండటం, చివరగా టీఆర్ఎస్ నేతల్లో అంతఃకలహాలు పెరిగి పోతుండటంతో కేసీయార్ లో కలవరం పెరిగిపోతోందని సమాచారం. దేశవ్యాప్తంగా టూర్లు, కిసాన్ సెల్లులు, పార్టీ ఆఫీసుల ఓపెనింగులు మళ్ళీ చేసుకోవచ్చు ముందు తెలంగాణాలో వ్యవహారాలను చక్కబెట్టుకోవాల్సిన అవసరంపై దృష్టిపెట్టారు.

ఈ కారణంగానే పార్టీలో పెరిగిపోతున్న అంతర్గత కలహాలపై దృష్టికేంద్రీకరించారు. రెండురోజుల క్రితమే కొమ్రం భీం జిల్లాలోని వాంకిడే మండలంలో 18 మంది సర్పంచులు రాజీనామాలు చేయటం కూడా సంచలనంగా మారింది. ఇలాంటి అనేక సమస్యల పరిష్కారం కేసీయార్ కు తక్షణావసరం అయిపోయింది. అందుకనే బీఆర్ఎస్ విస్తరణను కొద్దిరోజులు వాయిదా వేసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఒకవైపు కేసీయార్ దూకుడుమీద బీజేపీకి చాలెంజులు చేస్తుంటే అంతే తీవ్రతలో రివర్సులో సమస్యలు చుట్టుముడుతున్నాయి. మరి ముందు తెలంగాణాను ఎప్పుడు చక్కబెట్టుకుంటారు ? తర్వాత ఇతర రాష్ట్రాల్లో విస్తరణ పనులు ఎప్పుడు మొదలుపెడతారో అర్ధంకావటంలేదు.మరింత సమాచారం తెలుసుకోండి: