నెల్లూరు జిల్లాలో చంద్రబాబునాయుడు కందుకూరు బహిరంగసభ చివరకు సంతాపసభగా మారిపోయింది. ఇదేంఖర్మ..రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల జిల్లా పర్యటనను బుధవారం ప్రారంభించారు. మొదటి బహిరంగసభే కందుకూరులోని ఎన్టీయార్ సర్కిల్ దగ్గర జరిగింది. సభ ప్రారంభమైన 5 నిముషాల్లోపే తొక్కిసలాగ జరగటంతో సుమారు 15 మంది పక్కనే ఉన్న ఓపెన్ డ్రైనేజిలో పడిపోయారు. దాంతో డ్రైనేజిలో ముణగిపోయిన వారిలో 8 మంది చనిపోయారు. ఇద్దరు ప్రమాధస్ధలంలోను మరో ఆరుగురు ఆసుపత్రిలో మరణించారు.





అసలు ప్రమాధానికి కారణం ఏమిటి ? ఏమిటంటే తక్కువస్ధలంలో తమ్ముళ్ళు బలప్రదర్శనకు దిగటమే కారణం. ఎన్టీయార్ సర్కిల్ చాలా చిన్నదని టీడీపీ నేతలకు బాగా తెలుసు. తెలిసికూడా పార్టీ శ్రేణులను పోటీలుపడి  పెద్దసంఖ్యలో తరలించారు. చంద్రబాబు సభలకు జనాలు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారని చూపించటమే టార్గెట్ గా జనాలను తరలించారు. జనాలను తీసుకొచ్చిన నేతలు ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకున్నారా అంటే లేదు.





బహిరంగసభ ఏర్పాటుచేసిన సర్కిల్లోనే పెద్ద ఓపెన్ డ్రైనేజి ఉన్న విషయం నేతలందరికీ బాగా తెలుసు. అయినా డ్రైనేజిని ఎవరు పట్టించుకోలేదు.  కనీసం డ్రైనేజికి పక్కనే బ్యారికేడ్లు కట్టుంటే బాగుండేది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా డ్రైనేజి పక్కన బహిరంగసభ నిర్వహించిన నేతలే ప్రమాధానికి పూర్తి బాధ్యత వహించాలి. ఇదే సమయంలో అధికారుల అలసత్వాన్ని కూడా  గమనించాలి. ఓపెన్ డ్రైనేజి పక్కన బహిరంగసభకు అనుమతి ఇవ్వకపోయుంటే ఇపుడీ మరణాలు జరిగుండేవికావేమో. ప్రమాదం జరగ్గానే చంద్రబాబు ప్రోగ్రామ్ ను రద్దుచేసుకుని ఆసుపత్రికి వెళ్ళారు. తర్వాత సంతాపసభ నిర్వహించారు.




అయితే ఏదైనా కారణాలతో అధికారులు సభకు అనుమతి నిరాకరించగానే రాజకీయంగా గోలగోల చేసేయటం టీడీపీకి బాగా అలవాటు. బహుశా ఈ కారణంగానే అధికారులు పట్టించుకునుండరు. అయితే కనీసం పోలీసులన్నా గట్టి బందోబస్తు చేసుంటే బాగుండేది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మరణించిన వారికి ప్రభుత్వం కోటిరూపాయలు పరిహారం ప్రకటించినపుడు చంద్రబాబు రచ్చచేశారు. కనీసం రు. 2 కోట్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. మరి తన బహిరగసభ సందర్భంగానే చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారంగా రు. 10 లక్షలు ప్రకటించటం ఆశ్చర్యంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: