తిరుపతి జిల్లా వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డిపై వేటు పడటం ఖాయమేనా ? పార్టీలో జరుగుతున్న డెవలప్మెంట్లు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఆనం వైఖరి అన్న విషయం అర్ధమైపోతోంది. పార్టీలోనే ఉంటు ప్రభుత్వంపైన నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఆనం మాట్లాడే మాటలు, చేసే ఆరోపణలు, విమర్శలు పార్టీతో పాటు ప్రభుత్వానికి డ్యామేజింగ్ గా తయారవుతోంది.





ఆనం మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఉద్దేశ్యపూర్వకంగానే మాట్లాడుతున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే ఆనంపై ఏదో ఒక చర్య తీసుకోవాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఆనం ఇలాగ మాట్లాడటానికి ప్రధాన కారణం ఆయనలో పేరుకుపోయిన అసంతృప్తే. వైసీపీలో చేరి వెంకటగిరి ఎంఎల్ఏగా పోటీచేసి గెలవగానే మంత్రిపదవిని ఆశించారు. అయితే అది దక్కలేదు. తనకన్నా జూనియర్ అయిన అనీల్ మంత్రివర్గంలో చేరారు.





ఇది సరిపోదన్నట్లు పార్టీలోను, అధికారయంత్రాంగంలోను ఆనం మాట చెల్లుబాటు కావటంలేదు. దాంతో బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తంచేయటం మొదలుపెట్టారు. ఆనం ఉద్దేశ్యం ఏమిటంటే తన అసంతృప్తిని బయటకు చూపిస్తే జగన్ దగ్గరకు తీసుకుంటారని అనుకున్నట్లున్నారు. అయితే ఆనం లాంటి వాళ్ళని జగన్ చాలామందిని చూశారు. అందుకనే ఆనంను జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆనంలో అసంతృప్తి బాగా పెరిగిపోయి చివరకు ప్రభుత్వంపైనే నోటికొచ్చింది మాట్లాడేంత వరకు చేరుకుంది.





ఈ నేపధ్యంలోనే నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డిని వెంకటగిరి ఇన్చార్జిగా వేయటానికి రంగం సిద్ధమైంది. అధికారికంగా ప్రకటన రావటమే మిగిలింది. ఆనం వైఖరి చూస్తుంటే పార్టీలో ఎక్కువరోజులు ఉండేట్లు లేరని తెలిసిపోతోంది. ఈ విషయం జగన్ కూడా గ్రహించబట్టే ఎంఎల్ఏని అసలు పట్టించుకోవటంలేదు. మొత్తానికి ఎంఎల్ఏ ఉండగానే వెంకటిగిరి నియోజకవర్గానికి ఇన్చార్జిని నియమించారంటే అర్ధమేంటి ? ఎంఎల్ఏకి బయటకు వెళ్ళమని దారి చూపించటమే. సో ఎప్పటినుండో లోలోపలే ఉన్న ఆనం అసంతృప్తి ఇపుడు బద్దలవుతోంది. ఇదే సమయంలో ఇంతకాలం ఉపేక్షించిన జగన్ ఇకపై టైం వేస్టు చేయకూడదని అనుకున్నారు. అందుకనే రామ్ కుమార్ రెడ్డిని ఇన్చార్జిగా వేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: