జనాలు అనుకుంటేనే తాను ముఖ్యమంత్రి అవ్వగలను అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇంత కాలానికి జ్ఞోనదయం అయ్యింది. ఇంతకాలం వచ్చేఎన్నికల్లో తాను ముఖ్యమంత్రిని అయిపోతానని ఒకసారి, జనసేనే అధికారంలోకి రాబోతోందని మరోసారి చెప్పారు. అంతకుముందు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం ఎలాగ అవుతారో చూస్తానని చాలెంజ్ చేశారు. వైసీపీని ఎట్టి పరిస్ధితుల్లోను గెలవనీయను అంటు బల్లగుద్దకుండా చెప్పారు. అలా చాలెంజెలు చేసి చేసి చివరకు బొక్కబోర్లా పడ్డారు.





జగన్ గెలిచినా, అంతకముందు చంద్రబాబునాయుడు గెలిచినా అంత జనాల చేతిల్లోనే ఉందన్న విషయం పవన్ మరచిపోయారు. 2014లో చంద్రబాబుకు అధికారం అప్పగించాలని జనాలు అనుకున్నారు ఓట్లేసి గెలిపించారు. 2019లో చంద్రబాబు అవసరంలేదని అనుకున్నారు. జగన్ కు ఒక అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకనే చంద్రబాబును ఘోరంగా ఓడగొట్టి జగన్ కు అఖండ మెజారిటినిచ్చారు. ఇదే సమయంలో పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను పవన్ను ఓడించారు.





అంటే అర్ధమేంటి ప్రజాప్రతినిధిగా పవన్ అవసరంలేదని జనాలు డిసైడ్ అయినట్లే కదా. జగన్ అనుకుంటే సీఎం కాలేదు. చంద్రబాబు అధికారంలో ఉండేందుకు ఎంత ప్రయత్నించినా ఉండలేకపోయారు. గెలుపుమీద ఓవర్ కాన్ఫిడెన్సుతో రెండుచోట్ల నామినేషన్ వేసిన పవన్ కు రెండు చోట్లా మాడు పగిలింది. అంటే ఒకళ్ళని ఓడించినా, మరొకళ్ళని గెలిపించినా ఇంకోళ్ళని రెండుచోట్లా ఓడగొట్టినా అంతా జనాలిష్టప్రకారమే జరిగిందన్న విషయం పవన్ కు ఇప్పటికి అర్ధమైంది.





ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. జనాలు అనుకుంటేనే ఏమన్నా జరుగుతుంది. అంతే కానీ నేను తురుముఖాన్ అని, నేను అంతటోడ్ని ఇంతడోణ్ణి అని ఎవరికి వాళ్ళు ఎంత వీర్రవీగినా అంతా సొల్లుమాత్రమే. మొత్తానికి ఇంతకాలానికి పవన్ కు నేను అనుకుంటే అనే దశ దాటి ప్రజలు అనుకుంటే అని చెప్పారంటే ప్రజాస్వామ్యంలోని మర్మం అర్ధమైనట్లుంది. మొన్న చంద్రబాబును ఘోరంగా ఓడగొట్టిన జగన్ను సీఎం చేశారు. రేపటి ఎన్నికల్లో జగన్ అవసరంలేదని అనుకుంటే ఓడగొట్టి పవన్నో లేకపోతే ఇంకెవరినో సీఎం కుర్చీలో కూర్చోబెడతారనటంలో సందేహంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: