ఇలాంటి పిచ్చిరాతలు రాస్తున్నది కాబట్టే దీన్ని జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎల్లోమీడియా అంటున్నది. ఇపుడు విషయం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న మాగుంట ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి గాలికొదిలేశారంటు పెద్ద కథనం అచ్చేసింది. లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన మాగుంట రాఘవరెడ్డికి జగన్ మద్దతు లభించటం అనుమానస్పదమే అని విశ్లేషకులు భావిస్తున్నారట. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాగుంట ఫ్యామిలీకి ఇబ్బందులు మొదలైనట్లు ఎల్లోమీడియా తేల్చేసింది.





విచిత్రం ఏమిటంటే ఇదే కథనంలో రాజకీయంగా మాగుంట ఫ్యామిలీకి జగన్ బాగా సపోర్టిస్తున్నట్లు మరోచోట చెప్పింది. అంటే ఒకసారేమో మాగుంట ఫ్యామిలీని పట్టించుకోవటం లేదని, మరోచోటేమో మాగుంట ఫ్యామిలీకి జగన్ బాగా సపోర్టుగా ఉన్నట్లు చెప్పింది. స్కామ్ లో ఇరుక్కున్న మాగుంట ఫ్యామిలీకి మద్దతుగా జగన్ కానీ లేదా జిల్లాలోని సీనియర్ నేతలు కాని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మద్దతుగా నిలవలేదని తెగ బాధపడిపోయింది.





స్కామ్ కు సంబంధించి  ఇకముందు కూడా జగన్ మద్దతు మాగుంట ఫ్యామిలీకి దక్కే అవకాశంలేదని ఎల్లోమీడియా ఫైనల్ చేసేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని రక్షిస్తున్నది జగనే అని నానా గోల చేస్తోంది. బాబాయ్ వివేకా హత్యకు తనకు ఎలాంటి సంబంధంలేదని అవినాష్ చెబుతున్నా ఎల్లోమీడియా పట్టించుకోకుండా తాను రాయదలచుకున్నది రాసేస్తోంది.





ఇపుడు ఢిల్లీ స్కామ్ లో ఇరుక్కున్న  మాగంట ఫ్యామిలీని జగన్ పట్టించుకోవటంలేదని రాస్తున్నదీ ఎల్లోమీడియానే. ఒకవేళ ఇపుడు గనుక జగన్ ఢిల్లీకి వెళ్ళి నరేంద్రమోడీని ఏ విషయంలో కలిసినా వెంటనే మాగుంటను రక్షించేందుకే జగన్ వెళ్ళి మోడీని కలిశారంటు దుమ్మెత్తిపోసేదీ ఎల్లోమీడియానే. అంటే ఒకవైపు కడప ఎంపీని రక్షిస్తున్నారని గోలచేస్తు మరోవైపు మాగుంటను పట్టించుకోవటంలేదని జగన్ పై విచిత్రమైన కథనాలు వండి వార్చటం ఎల్లోమీడియాకు మాత్రమే చేతనవుతుంది. ఎందుకంటే జగన్ మీద పడి ఏడవటమే ఎల్లోమీడియా అజెండాగా పెట్టుకున్నది కాబట్టి.


మరింత సమాచారం తెలుసుకోండి: