మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు పై మాజీఎంపీ ఉండవల్లి  అరుణ్ కుమార్ చేస్తున్న 16 ఏళ్ళ ఫైట్ లో కొంత సక్సెస్ అయ్యారు. మార్గదర్శి డిపాజిట్లు, చెల్లింపులు తదితరాలపై సుప్రింకోర్టులో మంగళవారం ఇటు ఉండవల్లి అటు రామోజీ లాయర్ వాదనలు వినిపించారు. రెండువైపులా వాదనలు విన్న తర్వాత సుప్రింకోర్టు జోక్యం చేసుకుని మార్గదర్శిలో తీసుకున్న డిపాజిట్లు, తిరిగి చెల్లించిన వివరాలన్నింటినీ ప్రకటించాలని ఆదేశించింది. డిపాజిట్ల వివరాలు ప్రకటించేందుకు రామోజీ లాయర్ అంగీకరించలేదు. దాంతో సుప్రింకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.





తీసుకున్న డిపాజిట్లన్నింటినీ తిరిగి చెల్లించేసినపుడు వివరాలు ప్రకటించటంలో దాపరికం ఎందుకంటు నిలదీసింది. దాంతో లాయర్ కు ఏమి సమాధానం చెప్పాలో దిక్కుతోచలేదు. ఇదే విషయాన్ని సుప్రింకోర్టు గట్టి చెప్పటంతో వివరాలను తొందరలోనే ప్రకటిస్తామని లాయర్ హామీ ఇచ్చారు. దాంతో కేసు విచారణ వాయిదాపడింది. ఇక్కడ విషయం ఏమిటంటే ఎవరెవరి నుండి డిపాజిట్లు తీసుకున్నది ? తిరిగి ఎవరెరవరికి చెల్లించింది ? చెల్లింపులన్నీ ఏ పద్దతిలో జరిగింది లాంటి వివరాలను బయటపెట్టమని రామోజీని  ఉండవల్లి గడచిన 16 ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నారు.





అయితే ఉండవల్లి డిమాండ్లకు రామోజీ ఏనాడు స్పందించలేదు, డిపాజిట్ల వివరాలను బయటపెట్టలేదు. తాజాగా సుప్రింకోర్టు ఆదేశాలు అయ్యాయి కాబట్టి ఇపుడు ఆ వివరాలను బయటపెట్టక రామోజీకి వేరేదారిలేదు.





2600 కోట్ల డిపాజిట్లను వెనక్కి ఇచ్చేసినట్లు చెప్పుకుంటున్న రామోజీ ఆ మొత్తాన్ని ఎవరి దగ్గరనుండి తీసుకున్నారు ? ఏ రూపంలో, ఎంతమందికి చెల్లించారన్న విషయాలు ఇపుడు బయటకొస్తాయి. ఉండవల్లి ప్రకారం మార్గదర్శి డిపాజిట్లలో సుమారు 40 శాతం డిఫాల్టర్లున్నారు. డిఫాల్టర్లున్నా క్రమంతప్పకుండా డిపాజిట్లు వస్తునే ఉన్నాయట.  అంటే ఆ 40 శాతం బినామీలా ? లేకపోతే మేనేజ్మెంటే కట్టేస్తోందా ? అన్నది తేలుతుంది. ఈ విషయాలు బయటపడతాయి కాబట్టే రామోజీ ఇన్ని సంవత్సరాల నుండి వివరాలు బయటపెట్టలేదన్నది ఉండవల్లి వాదన. సుప్రింకోర్టు ఆదేశాలతో తొందరలోనే మార్గదర్శి బండారమంతా బయటపడుతుంది. మరి లెక్కల్లోని బొక్కలు ఏ మేరకు బయటపడతాయో చూడాల్సిందే.   





మరింత సమాచారం తెలుసుకోండి: