శ్రీకాకుళంలో జగన్మోహన్ రెడ్డి చేసినే ప్రకటన చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతోంది. జిల్లాలోని మూలపాడు (భావనపాడు)పోర్టు నిర్మాణ పనులకు జగన్ శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతు సెప్టెంబర్ నుండి తాను విశాఖపట్నంలోనే కాపురం ఉండబోతున్నట్లు ప్రకటించారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా తాను కూడా విశాఖపట్నంకు వచ్చేస్తానని చెప్పారు. విశాఖకు వచ్చే విషయంలో జగన్ ఇంతకుముందు ఇంత స్పష్టంగా ఎప్పుడూ ప్రకటించిందిలేదు.





ఇపుడు ప్రకటించారు కాబట్టి సెప్టెంబర్లో వచ్చేయటం ఖాయమనే అనుకోవాలి. అంతాబాగానే ఉంది కానీ మూడు రాజధానుల వివాదం సుప్రింకోర్టు విచారణలో ఉంది. విచారణ ఎంత తొందరగా జరిగితే అంత మంచిదని జగన్ ప్రయత్నిస్తుంటే సుప్రింకోర్టేమో విచారణను వాయిదాల మీద వాయిదాలేస్తోంది. దాంతో కోర్టులో జరిగే విచారణ ప్రక్రియపై జగన్ లో అసహనం పెరిగిపోయినట్లుంది. అందుకనే కోర్టు తీర్పుతో సంబంధంలేకుండా తాను క్యాంపాఫీసును వైజాగ్ తరలించేసేందుకు రెడీ అయిపోయారు.





అధికారికంగా మూడురాజధానులంటే కోర్టు తీర్పువరకు వెయిట్ చేయాల్సిందే. విచారణ ఎప్పటికి జరిగేను, తీర్పు ఎప్పుడు వచ్చేను ? ఎలా వస్తుందో కూడా ఎవరు చెప్పలేకున్నారు. అందుకనే సుప్రింకోర్టులో విచారణ, తీర్పుతో పనిలేకుండా తాను మాత్రం విశాఖకు వచ్చేయాలని జగన్ డిసైడ్ అయిపోయారు. రాజధానులను అయితే కోర్టు తీర్పు లేకుండా చేయలేరు. కానీ క్యాంపాఫీసును అయితే ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. వైజాగ్ లో క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసుకునేందుకు ఎవరు అభ్యంతరం చెప్పేందుకు లేదు, ఒకవేళ అభ్యంతరాలు చెప్పినా చెల్లుబాటు కాదు.





అందుకనే సుప్రింకోర్టు తీర్పుతో పనిలేకుండా తానొచ్చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి విశాఖపట్నంకు ముందు తానొచ్చేస్తే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీకి మంచి ఫలితాలు దక్కుతాయని జగన్ అనుకున్నట్లున్నారు. ఎన్నికల్లోపు మూడురాజధానులకు అనుకూలంగా తీర్పొస్తే సరేసరి. లేకపోయినా పర్వాలేదు క్యాంప్ ఆఫీసును తరలించేస్తారు కాబట్టి పాలన మొత్తాన్ని వైజాగ్ నుండే నడిపిస్తారు. అధికారికం ఏమిటి ? అనధికారికం ఏమిటి ? సీఎం ఎక్కడుంటే అదే క్యాంపాఫీసు. కాబట్టి ఆ పద్దతిలో వైజాగ్ కు రాజధాని హోదా వచ్చేస్తుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: