ప్రస్తుతం ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఎవరైనా వాహనదారుడు వాహనాన్ని బయటకు తీసి రహదారి మీదికి రావాలి అంటే తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అన్న విషయం తెలిసిందే. డ్రైవింగ్ లైసెన్స్ లేదు అంటే చాలు ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు షాక్ ఇస్తూ భారీగా జరిమాణాలు విధిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ జరిమానాలకు భయపడిపోతున్న వాహనదారులు ఇష్టం లేకపోయినా ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. అయితే కారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సార్లు వాహనదారులు ఇబ్బంది పడటం చూస్తూ ఉంటాం.



 ఎందుకంటే లైసెన్స్ తీసుకోవడానికి వెళ్లిన ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా డ్రైవింగ్ టెస్ట్ లో పాస్ కావలసి ఉంటుంది. ఇక రూల్స్ ప్రకారం ఉన్న ఒక సర్కిల్లో వాహనాన్ని సమర్ధవంతంగా నడిపినప్పుడు మాత్రమే ఇక సదురు వ్యక్తి సక్సెస్ఫుల్గా ఇలా డ్రైవింగ్ టెస్ట్ కంప్లీట్ చేసినట్లు అవుతుంది. అలా చేస్తేనే ఇక డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు అవుతుంది అని చెప్పాలి. ఇలాంటి రూల్ కారణంగా ఎంతో మంది ఇప్పటివరకు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ అలాంటి వారికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డ్రైవింగ్ టెస్ట్ చేయకుండానే లైసెన్స్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.



 అదేంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్ ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా.. ఇక్కడే ఒక మెలిక పెట్టింది కేంద్ర ప్రభుత్వం. లైసెన్స్ జారీ చేసే అధికారాన్ని మొత్తం డ్రైవింగ్ స్కూల్స్ కు కట్టబెడుతూ నిబంధనలను సడలించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే డ్రైవింగ్ స్కూల్ ఇచ్చే సర్టిఫికెట్ ఆధారంగానే ఇకనుంచి వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వనున్నారు. అదే సమయంలో డ్రైవింగ్ స్కూల్ పెట్టుకునే వారికి కూడా ఒక మెలిక పెట్టింది. ఇలా డ్రైవింగ్ స్కూల్ పెట్టుకోవాలంటే.. కనీసం ఐదేళ్ల అనుభవం.. కారు ట్రైనింగ్ కోసం ఎకరం స్థలం.. కనీసం ఇంటర్ చదువు పూర్తి చేసి ఉండాలి అంటూ నిబంధన పెట్టింది కేంద్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: