రఘు రామ కృష్ణం రాజు మరో సారి జగన్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలని బట్టి రఘురామ కృష్ణంరాజుకు ఇన్నాళ్లు సైలెంట్ గాఉంది మళ్ళీ కోప్పడడానికి ఓ కారణం ఉందని చెప్తున్నారు. ఇటీవల జగన్ అమిత్ షా ను కలసినప్పుడు రఘురామ కృష్ణంరాజు అనర్హత పిటీషన్ విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు చెబుతున్నారు. తనను వదలిపెట్టకుండా వెంటపడుతుండటంపై రాజుగారు ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాకుండా తాను చేరాలనుకుంటున్న బీజేపీతో వైసీపీ సత్సంబంధాలు మెయిన్ టెయిన్ చేయడం కూడా రఘురామ కృష్ణంరాజు కు రుచించడం లేదు.