పార్లమెంటు సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ పై ఎందుకో అసంతృప్తి ని చుపిస్తున్నాడట..గత కొంతకాలంగా ఆయన జిల్లాను కూడా పట్టించుకోవడం లేదు. ఆయన కరోనాకు భయపడే నెల్లూరుకు రావడం లేదన్న టాక్ వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కేసులు ఎక్కువగా ఉండటం, తాను వస్తే ప్రజలు తనను కలిసేందుకు పెద్ద సంఖ్యలో వస్తారని భావించి ఆదాల ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కానీ అసలు అది కాదని తెలుస్తుంది.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి కి తనకు కాకుండా వేరే వారికి కాంట్రాక్టులు వెళ్లిపోవడం ఆయనను బాధించింది.