నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. కొద్ది రోజులే సమయం ఉండడంతో తాజా పరిణామాల నేపథ్యంలో ఇక నుంచి తీసుకోవాల్సిన కార్యాచరణపై బీజేపీ చర్చించినట్లు తెలిసింది. రఘునందన్ ను వివాదాలు చుట్టుముడుతుండడంపై దాని నుంచి బయటపడి పార్టీ విధానాలను, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇకపై మరింత పక్కాగా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అవసరమైతే కేంద్ర పెద్దల సహకారం కోరాలని, ప్రముఖులతో ప్రచారం చేయించాలని కార్యవర్గం నిర్ణయించింది. ఆ బాధ్యతను బండి సంజయ్ కు అప్పగించింది.