తెలంగాణ లో చాల రోజుల తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చాడని చెప్పాలి.. కరోనా తొలి దశలో ఉన్నప్పుడు కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు..కనిపించిన బీజేపీ ని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.. మొన్న రాజ్యసభలో వ్యవసాయ బిల్లు విషయంలో కేసీఆర్ చేసిన ఫైట్ గురించి అందరికి తెలిసిందే.. ఆ బిల్లు పాస్ అయితే వచ్చే నష్టాల గురించి రైతులకి చెప్పే విధంగా ప్రయత్నం చేశారు. కానీ ఇతర పార్టీ ల సపోర్ట్ తో మోడీ ఆ బిల్లును పాస్ చేసి రైతుల ఆగ్రహానికి గురయ్యాడు..