కాపు వర్గ నేత గా ముద్రగడ పద్మనాభం ఆ వర్గ తరపున చేసిన పోరాటాల సంగతి అందరికి తెలిసిందే.. చంద్రబాబు హయాంలో ఎంతో యాక్టివ్ గా ఉన్న ముద్రగడ ప్రస్తుతం అంతగా ప్రభావం చూపించలేకపోతున్నాడని చెప్పాలి.. కరోనా ప్రభావం తో కిర్లంపూడి నుంచి అమరావతి వరకూ చేయాలనుకున్న పాదయాత్ర కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.. దాంతో ముద్రగడ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేతగా అయన చేసిన సేవలు అమోఘం.. అయితే గత కొన్ని రోజులుగా అయన రాజకీయాలనుంచి తప్పుకున్నట్టు వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి.