ఇద్దరు ఒక్కరిని ఒక్కరు ఇష్టపడ్డారు. ఇక ఇద్దరు పెద్దలను ఓడించి పెళ్లి చేసుకుని ప్రేమలో గెలిచారు. కానీ విధి వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. బిడ్డ పుట్టిన ఐదు రోజులకే భర్త ప్రమాదంలో కన్నుమూశాడు. అయితే బాలింతగా ఉన్న ఆమెకు భర్త చనిపోయాడన్న విషయం చెప్పడానికి కుటుంబ సభ్యులు సంకోచించారు.