విశాఖలో మూడు రోజుల క్రితం స్టీల్ ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్ కలకలం రేపింది. అదృశ్యమైన ఉద్యోగి శ్రీనివాసరావు ఆచూకీ ఇంకా లభించలేదు. బ్లాస్ట్ ఫర్నేస్లో ఆత్మాహుతి చేసుకుంటున్నట్టు అతడు లేఖ రాసి అదృశ్యమయ్యాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం కోసం ఆత్మహుతి అవుతున్నట్టు లేక రాసి కనిపించకపోవడం కలకలం రేపింది. అయితే ఆయన అదృశ్యం వెనుక మిస్టరీ దాగి ఉందని తెలుస్తోంది.