సినిమాలో చూపించిన విధంగా నిజ జీవితంలోను పెళ్లిని పీటల మీద ఆపడం ట్రెండ్ అయ్యింది. అమ్మాయి వాళ్లు కట్నం తక్కువ ఇచ్చారని, మర్యాదలు సరిగా చేయలేదని, వధూవరుల్లో ఎవరికైనా ప్రేమ వ్యవహారం ఉందని తెలియడం.. ఇలా పెళ్లి నిలిచిపోవడానికి కారణాలు అనేకం ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు చిన్న విషయాలు దాచడం వల్ల కూడా పెళ్లి ఆగిపోతుంది.