సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. మరణం ఎప్పడు ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. తాజాగా రాజస్థాన్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోవిడ్ 19 సోకిన మృతదేహనికి నిబంధనలు పాటించకుండా ఖననం చేసిన ఘటనలో 21 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్లోని సికార్ జిల్లాలోని ఖేర్వా గ్రామంలో చోటుచేసుకుంది.