యాస్ తుపాన్ ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. ఇక రెండు రాష్ట్రాలను వణికించిన తుపాను బుధవారం ఉదయం బాలేశ్వర్ జిల్లాలోని బహనాగ వద్ద తీరాన్ని దాటింది. ఇక ఒడిశా తీర ప్రాంతాలపై తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే మొత్తానికి యాస్ తుపాను ఒడిశా ప్రజలకు ఎప్పటికీ మరవలేని అనుభవాన్ని మిగిల్చింది.