చలికాలం వచ్చేసింది... చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి.  దీంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు.  ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  చలి తీవ్రత పెరిగితే దాని కారణంగా శరీరంలో తెలియకుండానే చలి పెరుగుతుంది.  జలుబు, రొంప, దగ్గు వంటివి వస్తుంటాయి.  అంతేకాదు, చలికాలంలో వచ్చే వ్యాధుల్లో స్వైన్ ఫ్లూ కూడా ఒకటి.  


ఇది మాములు ఉష్ణోగ్రతల్లో బయట కనిపించదు.  కానీ, చలి తీవ్రత పెరిగితే దాని ఎఫక్ట్ కనిపిస్తుంది.  ఇప్పుడు తీవ్రత పెరిగిపోయేలా ఉన్నది.  ప్రతి ఏడాది ఈ స్వైన్ ఫ్లూ కారణంగా వందలాది మంది మరణిస్తున్నారు.  దీంతో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అంటే తిరిగి ఉష్ణోగ్రతలు పెరిగే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం చెప్తున్నది.  ఇప్పటికే దేశంలో స్వైన్ ఫ్లూ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి.  


దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యంగా మహానగరంలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.  అయితే, ప్రభుత్వం దీనిపై అవగాహనా కల్పిస్తూ వీలైనంతగా పరిష్కరించేందుకు అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో కిట్ లను అందుబాటులో ఉంటుంది.  ఎలాంటి అనుమానం ఉన్నా హాస్పిటల్ కు వచ్చి చికిత్స చేయించుకోవాలి.  అంతేకాదు, హాస్పిటల్ కు వచ్చి చికిత్స చేయించుకుంటే దాని వలన వీలైనంతగా బయటపడే అవకాశం ఉంటుంది.  


అంతేకాదు, ప్రతి ఒక్కరు విధిగా చెక్ చేయించుకోవాలని అంటున్నారు.  ఇక ప్రస్తుతం రోజు 70 కేసుల చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నారు.  ఇది తీవ్రరూపం దాల్చితే దానిని రోజుకు 600 వరకు పరీక్షలు చేసేందుకు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు.  ఇందుకోసం కోటి రూపాయల ఖర్చుతో వైద్యపరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.  ముఖానికి కట్టుకునే మాస్క్ లనుంచి ప్రతి ఒక్కటి కొనుగోలు చేసింది ప్రభుత్వం.  ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు హాస్పిటల్ వర్గాలు తెలియజేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: