తెలంగాణ బిజెపి నాయకులు పని తీరుపై కేంద్ర పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ బిజెపి జెండా రెపరెపలాడించాలని చూస్తుంటే... స్థానిక నాయకులు మాత్రం ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకు వెళ్ళలేకపోతున్నారు అనే  బాధ వారిలో ఎక్కువగా ఉంది. తాజాగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ పెద్దలు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో రోజు రోజుకి బలపడాలి అని చూస్తుంటే ఇలా వెనకబడి వుండడం తో బిజెపి అధిష్టానం ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. 


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం మూడు స్థానాలు మాత్రమే ఆ పార్టీ దక్కించుకుంది. కేసీఆర్ ప్రభుత్వం పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఇది రుజువు అవుతుందని అంతా భావించగా దానికి భిన్నంగా దేశంలోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తూ టిఆర్ఎస్ మున్సిపల్ ఫలితాలను సాధించింది. ఇదే బిజెపి ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది.ఈ మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 15 నుంచి 20 మున్సిపాలిటీ స్థానాలు గెలుస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు అధిష్టానానికి స్పష్టంగా హామీ ఇచ్చారు. అయితే ఫలితాలు దారుణంగా రావడంతో  అధిష్టానానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర నాయకులు ఉండిపోయారు.


ఇదే విధంగా రాజకీయాలు నడిపితే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో మరింత బలహీనపడతామని భావిస్తున్న బీజేపీ అధిష్టానం దీనిపై సీరియస్ గా దృష్టి సారించింది. దీనిలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఆకస్మాత్తుగా ఢిల్లీకి రావాలంటూ పిలుపునిచ్చింది ఆయనతో పాటు రాష్ట్రానికి చెందిన కీలక నాయకులు కూడా  రావలసిందిగా అధిష్ఠానం నుంచి సీరియస్ గా ఆదేశాలు రావడంతో తెలంగాణ బిజెపి నాయకులు ఆందోళన మొదలైంది. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తమకు క్లాస్ పీకుతారని వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: