కమెడియన్ అలీ తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అలీ ఆ తర్వాత హీరోగా ఆ తర్వాత కమెడియన్ గా మారి ఇప్పటికి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. తనదైన స్టైల్ కామెడీతో... తనకే సొంతమైన డైలాగ్ డెలివరీతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం వ్యాఖ్యాతగా కూడా ఆదరగోడుతున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి తనదైన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు కమెడియన్ అలీ. ఇదిలా ఉంచితే.. గతంలో అలీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి ప్రవేశించాలి అనుకున్నా కమెడియన్ అలీపార్టీ లోకి వెళ్లాలని కొన్ని రోజుల పాటు తర్జనభర్జన పడ్డారు. తనకు సన్నిహితుడైన పవన్ కళ్యాణ్ పార్టీ లోకి వెళ్ళకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి అందరికీ షాకిచ్చాడు. 

 

 

 అప్పట్లో అలీ వ్యవహారం హాట్ టాపిక్ గా కూడా మారిన విషయం తెలిసిందే. అయితే రాజకీయాలకు స్నేహానికి సంబంధం లేదు అంటూ పవన్ కల్యాణ్ ని ఉద్దేశించి అలీ   చేసిన వ్యాఖ్యలు సంచలనం గా కూడా మారాయి. అయితే ప్రస్తుతం అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక అసలు కారణం వేరే ఉందని వార్తలు వస్తున్నాయి. తన వ్యక్తిగత ప్రయోజనాలకోసమే అలీ వైసీపీ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ముందే ఊహించిన అలీ... వైసీపీ కండువా కప్పుకున్నట్లు  తెలుస్తుంది. తన సమస్యకు రాజకీయాల్లోకి వెళితే పరిష్కారం లభిస్తుందని భావించారట. 

 

 

 

 ఇంతకీ ఆ ఈ సమస్య ఏంటి అంటారా.. కమెడియన్ అలీకి షాద్ నగర్ లో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయని అందులో అసైన్డ్ ప్రభుత్వ భూముల తో పాటు అటవీ ప్రాంతం కూడా ఉందని సమాచారం. అయితే వాటి నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు వైసీపీ పార్టీలో చేరితే తన సమస్య పరిష్కారం అవుతుందని భావించారట కమెడియన్ ఆలీ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న జగన్ తోనే పరిష్కారం లభిస్తుందని భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ఈ సమస్య పరిష్కారం అయినట్లు కూడా తెలుస్తోంది.అయితే పార్టీలో చేరినప్పుడు తప్ప ఆ తర్వాత ఆలీ ఎక్కడ తెరమీద కనిపించలేదు. ఎలాంటి ప్రచారం లో కూడా పాల్గొన లేదు. ఈ నేపథ్యంలో కేవలం వ్యక్తిగత సమస్య జగన్ పార్టీలో చేరి సద్వినియోగం చేసుకున్నాడు అంటూ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: