కుర్రవాడు, ఉత్సాహవంతుడు, సమర్ధుడు, ధైర్యవంతుడు, సమకాలికుడు, మొండివాడు, ముందుచూపు ఉన్న వాడు, ఇలా వీటిల్లో ఏ ఒక్క దాన్ని తీసుకున్నా పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు కంటే ఓ మెట్టు కాదు, పది మెట్లు పైనే ఉంటున్నాడు ఏపీ సీఎం జగన్. తాను ఏ పథకం ప్రవేశపెట్టిన, ఏ కఠిన నిర్ణయం తీసుకున్నా, అది అందరూ అనుకున్నట్లుగా ఆషామాషీగా అయితే చేయడం లేదు. దాని పై పూర్తిగా అవగాహన తెచ్చుకుని, సాధ్యాసాధ్యాలు పూర్తిగా పరిశీలించి అప్పుడు మాత్రమే దానిని అమలు చేస్తున్నాడు. జగన్ వ్యవహారం చూసి తెలుగుదేశం నాయకులే కాదు, చంద్రబాబు సైతం గగ్గోలు పెట్టేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ముందు చూపు, ఆయన చిత్తశుద్ధిని చూసి మనసులోనే కుళ్ళుకుంటున్నాడు బాబు. 

 

IHG

జగన్ ఈ నాలుగేళ్ల రాజకీయం కోసం తాపత్రయ పడడం లేదు. నాలుగేళ్ల తరువాత కూడా మళ్లీ తాము అధికారంలోకి రావాలని, ఈ నాలుగేళ్ల పరిపాలన చూపించి ఓట్లు అడగాలి అనేది జగన్ ఆలోచన. దానికోసమే ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. కేవలం తాము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రవేశపెట్టిన పథకాలనే  కాకుండా, గత ప్రభుత్వంలో అసంతృప్తిగా మిగిలిపోయిన పథకాలను కూడా తన హయాంలో పూర్తి చేసి, క్రెడిట్ కొట్టాలని జగన్ ఆలోచిస్తున్నాడు. దీనిలో భాగంగానే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనైనా 2021 నాటికి పూర్తి చేసి ఆ క్రెడిట్ అంతా కొట్టాలని జగన్ చూస్తున్నారు. 

IHG

ఒకవేళ ఆ ప్రాజెక్టు పూర్తి అయితే ఇక జగన్ కు తిరుగు ఉండదు. ఇవే కాదు రాజధాని విషయంలోనూ జగన్ నిర్ణయం ఈ విధంగానే ఉంది. అమరావతిలో ఇప్పటికిప్పుడు నిర్మాణాలు చేపట్టినా  అది తన హయాంలో పూర్తవ్వదనే విషయం జగన్ కు బాగా తెలుసు. అందుకే అమరావతిలో రాజధాని అంటూ హడావుడి చేసినా, అది వృధా ప్రయాస అని అందుకే జగన్ వ్యూహాత్మకంగా విశాఖను ఎంచుకున్నాడు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖలో మరికాస్త ఖర్చు పెడితే, మరో ఐదేళ్లలలో విశాఖ దేశానికి తలమానికమైన నగరంగా అభివృద్ధి చెందుతుందని జగన్ ఆలోచన. అందుకే అమరావతి నుంచి రాజధాని తరలించే విషయంలో ఎంతమంది అడ్డుపడుతున్నా జగన్ వెనక్కి తగ్గడంలేదు. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతిదీ అంతా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పట్టుసాధించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: