దేశవ్యాప్తంగా ప్రజలు అందరూ ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేసిన లాక్‌డౌన్‌పై సస్పెన్స్ వీడింది. అంతా ఊహించినట్లుగానే ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రతాపం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇవాళ్టితో లాక్‌డౌన్ కాలం ముగియనుండడంతో మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ మే 3 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కరోనాపై పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఇక కరోనా కట్టడికి దేశ ప్రజలు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన ఆయన కరోనాను కంట్రోల్ చేసేందుకు ఆరోగ్య సేతు యాప్‌ను వాడాలని చెప్పారు. ఇక లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న మోదీ ఆ తర్వాత పరిస్థితులను సమీక్షించి క్రమక్రమంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని చెప్పారు. ఇకపై కూడా ఆంక్షలు చాలా కఠినంగా ఉంటాయని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి