దేశంలో రోజురోజుకు కరోనా పెరిగిపోతోంది. ప్రజలందరినీ ఇంటికే పరిమితం అయ్యేలా చేసిన కాలు బయటపెట్టకుండా చేసిన కరోనా నియంత్రణ మాత్రం  జరగడం లేదు. రోజురోజుకు దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుంది . దేశంలో రోజు రోజుకూ క్లిష్ట పరిస్థితులు నెలకొంటున్నాయి . ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతోంది. లాక్ డౌన్ అమలుతో  ప్రజల నుంచి కాలు బయట పెట్టే పరిస్థితి కూడా లేదు. కానీ కరోనా  వైరస్ కేసులు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీనికి కారణం కొంతమంది నిర్లక్ష్యమే అంటున్నారు విశ్లేషకులు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్ని రోజుల్లో పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదం ఉంది అంటున్నారు. 

 

 

 అయితే ఏం చేయాలన్న ప్రస్తుతం భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలన్నా ఎవరిని  ముట్టుకోవాలి అన్న కరోనా భయమే కనిపిస్తుంది . అయితే ప్రస్తుతం కేవలం అత్యవసర సేవలు మినహా మిగతా సేవలు కూడా అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో అత్యవసర సేవల ద్వారా కూడా ప్రజలకు కరోనా  వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయా అంటే తాజాగా జరిగిన ఘటనతో అవుననే సమాధానం వినిపిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మటుకు ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. కేవలం అత్యవసరమైన నిత్య అవసరాల కోసం మాత్రమే బయటకు వస్తున్నారు. కూరగాయలు కొనుగోలు చేయడం లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి బయటకు వస్తున్నారు. ఆ సమయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. 

 

 

 కానీ ఇక్కడ కూడా కరోనా వైరస్  ప్రజలను వదలడం లేదు. కూరగాయాలు  కొనుక్కోవడానికి వెళ్లిన కరోనా  వైరస్ బారిన పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో గల  17 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే వీరంతా కూరగాయల వ్యాపారం చేస్తుంటారు అని తెలిసి అక్కడి ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక్కడి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా వణికిపోయారు. ప్రతిరోజు కూరగాయల వ్యాపారం చేసే వీరువద్ద  ఎంతోమంది ఈరోజు కూరగాయల కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో అని భయపడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ప్రజలకు స్క్రీనింగ్ నిర్వహించాల్సిన అవసరం వస్తుందని భావిస్తున్నారు. తాజా కూరగాయలు వ్యాపారులు  17 మంది కరోనా  వైరస్ పాజిటివ్ అని రావడంతో అక్కడి కూరగాయల దుకాణాలు మూసేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: