తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరఎస్ ప్రభావం పెరిగిపోతుంది.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్  అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రజలు ఎవరూ ఇంటి నుండి  కాళ్ళు బయట పెట్టకుండా ఉండేలా కఠిన నిబంధనలు అమలులోకి తెస్తోంది. అయితే రోజురోజుకు కరోనా వైరస్   కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు సడలిస్తూ మరింత కఠినతరం చేస్తూ  అమలులోకి తెస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలు ఇప్పటికే మూత పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తొమ్మిదో తరగతి వరకు అందరు విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్  చేస్తున్నట్టు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 

 

 అయితే తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహించబోతోంది  అనే  దానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. 10 వ  తరగతి పరీక్షలు ఎప్పుడు జరగబోతున్నాయి అనేదానిపై ఎవరికీ క్లారిటీ లేకపోవడంతో విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అయోమయంలో పడిపోయారు.ఇదిలా ఉంటే  డిగ్రీ పరీక్షలు కూడా ఎప్పుడు నిర్వహించాలి అనేదానిపై ప్రస్తుతం తెలంగాణ సర్కార్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 


 అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్ లైన్ పరీక్షల నిర్వహణ అసాధ్యమని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపి రెడ్డి తెలిపారు. కరోనా  వైరస్ ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడిన నాలుగు వారాల తర్వాత ప్రవేశ పరీక్షలు ఉంటాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపి  రెడ్డి వెల్లడించారు. డిగ్రీ ఫైనల్ పరీక్షలు తో ముడిపడి ఉన్న ప్రవేశపరీక్షలు డిగ్రీ పరీక్షల అనంతరమే నిర్వహించబడతాయి అంటూ ఆయన స్పష్టం చేసారు . అయితే అటు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని...కానీ  ఫలితాలతో సంబంధం లేకుండా ప్రమోట్ చేయాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపి రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: