ఓవైపు కరోనా  భయం.. మరోవైపు లాక్ డౌన్  ఎఫెక్ట్.. ఇంకోవైపు ఆర్థిక సంక్షోభం.. ఇలా ప్రజలందరూ కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఎదో విదంగా పబ్లిక్ ఖాతాలో డబ్బులు జమ చేయడం అనేది ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ప్రతి రెండు నెలలకి ఏదోవిధంగా పేదలకు దిగువ మధ్యతరగతి వాళ్లకి ఖాతాలోకి డబ్బులు జమ అయ్యే  విధంగా చర్యలు చేపడుతుంది సర్కార్. ఇందులో ముఖ్యంగా విద్యకు సంబంధించి జగన్ సర్కార్ కీలకంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే గత 11 నెలలు ఏకంగా 12 వేల కోట్ల రూపాయలు మెరుగైన విద్య కోసమే ఖర్చు పెట్టారు అన్నది ఏపీ సర్కార్ చెబుతున్న టువంటి లెక్క. 

 

 2018- 19 విద్యా  సంవత్సరానికి చెల్లించాల్సిన అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 1850 కోట్లు చెల్లించామని ఈరోజు జగనన్న  విద్యా వసతి దీవెన పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపారు. 2019-20 కి ఫీజు రియంబర్స్ మెంట్ కూడా  విడుదల చేశారు. అయితే 35 వేల లోపు ఇప్పటికైనా కాలేజీలకు ఏదైనా ఫీజు కట్టి ఉంటే ఆ సొమ్మును తిరిగి తీసుకోవాలి అని అటువంటిది ప్రభుత్వం సూచించింది. ఇకపోతే రానున్న 2020-21 విద్యా సంవత్సరంలో ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు కాకుండా ఏకంగా నేరుగా విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 

 


 కాగా  ఇప్పటివరకు ఓవరాల్గా విద్య కోసం ఖర్చు చేసినటువంటి లెక్క ఏపీ ప్రభుత్వం చెబుతున్న టువంటి లెక్కప్రకారం అమ్మ ఒడి పథకం కోసం 6500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నాలుగు వేల కోట్లు వసతి దీవెన కోసం 1100 కోట్లు... ఇక ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు అనే కార్యక్రమం కింద మొత్తం అన్ని కాలేజీలు పాఠశాలలకు  మార్చేందుకు 3,500 కోట్ల రూపాయలు విడుదల చేశాము అని అటువంటిది జగన్ సర్కార్ చెబుతున్న మాట. అయితే ఇందులో డైరెక్ట్గా ప్రజలకు ఇచ్చిన వైతే జగనన్న వసతి దీవెన అమ్మఒడి పథకం ద్వారా వచ్చినది ప్రజలకు నేరుగా చేరింది. అయితే మొదటి సంవత్సరం ఎలా ఉన్నప్పటికీ ఐదు సంవత్సరాల వరకు ఇలాగే డబ్బులు ఇవ్వగలరా  లేదా అన్నటువంటి జగన్ సర్కార్ ముందున్న సవాల్ అని  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: