ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు  కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే. మొదట్లో అతి తక్కువగా నమోదైన  వైరస్ కేసులు  ప్రస్తుతం భారీ రేంజ్ లో పెరిగిపోతున్నాయి. అటు జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్  విలయతాండవం నియంత్రించలేక పోతుంది అని చెప్పాలి. అయితే ఓ వైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా  వైరస్ తగ్గుముఖం పట్టినప్పటికీ...  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కరోనా  వైరస్ కేసుల సంఖ్య  పెరుగుతూనే వస్తోంది. 

 

 

 రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగి పోతోంది. ఏకంగా పదుల సంఖ్యలో ప్రతిరోజు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే తాజాగా ఏపీలో మరో కొత్త 71 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ సర్కార్ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. కరోనా  వైరస్ కేసుల సంఖ్య ఏకంగా 1403 కు చేరింది. ఇక ప్రస్తుతం ఆక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 1051 కాగా ఇప్పటికీ 341 మంది డిశ్చార్జ్ అయ్యారు. 31 ఈ వైరస్ భారిన పడి  మరణించారు. కొత్తగా గుంటూరులో 4, అనంతపురంలో 3,  చిత్తూరులో 3, ఈస్ట్  గోదావరిలో 2, కడప జిల్లాలో 4, కృష్ణాలో 10, కర్నూలులో 40 నెల్లూరులో కొత్తగా 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

 

 

 ముఖ్యంగా కర్నూలు జిల్లాలో రోజురోజుకూ పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది అనే చెప్పాలి. అక్కడి అధికారులు నాయకులు కొన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టినప్పటికీ కర్నూలులో కరోనా  వైరస్ కేసులు  రోజురోజుకు పెరిగిపోతు ప్రజలను  తీవ్ర భయాందోళనకు గురిచేస్తోన్నాయి . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో 50 శాతానికి పైగా కేసులు కేవలం కర్నూలు జిల్లాలోనే నమోదవుతుండటం ప్రస్తుతం ప్రభుత్వానికి కూడా తల నొప్పి గా మారిపోయింది. దీంతో కర్నూలులో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తోంది ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: