ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్  పూర్తికానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు నుండే  మార్గదర్శకాలను జారీ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పూర్తయ్యాక   ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు కొనసాగనున్నాయి ఎలాంటి ఆంక్షలు అమలులో ఉండనున్నాయి అనే విషయంలో ప్రజలకు పలు మార్గదర్శకాలను  జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ . అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్  తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు కొనసాగనున్నాయి అనేదాన్ని కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు పలు వివరాలను వెల్లడించారు. 

 

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్  సడలింపులు ఉంటాయని ఈ సందర్భంగా కృష్ణ బాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో గ్రీన్ జోన్ లో ఉన్న అన్ని ప్రాంతాలలో కార్యకలాపాలు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్భంగా కృష్ణబాబు తెలిపారు. అయితే రెడ్ జోన్ లలో  మాత్రం కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందని ఆయన తెలిపారు. వలస కార్మికుల విషయంలో కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కార్  కీలక నిర్ణయం తీసుకున్నట్లు  కృష్ణ బాబు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులు అందరూ తమ తమ స్వస్థలాలకు పంపుతున్నాము అంటూ చెప్పుకొచ్చారు. 

 

 

 ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఏకంగా 60 వేల మందికి పైగా వలస కార్మికులు ఉన్నారు అని తెలిపిన కృష్ణబాబు... వారందరిని  తమ తమ స్వస్థలాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిని  ఇక్కడికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అయితే వేరే రాష్ట్రం నుంచి వస్తున్నారు కనుక వారికి  వైరస్ సోకే అవకాశం ఉంది అని ప్రజలు భయపడాల్సిన పనిలేదని... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మన వాళ్ళకి ముందుగా  వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు 14 రోజులు క్వారంటైన్ లో ఉంచిన  అనంతరం తమ తమ గ్రామాలకు పంపిస్తాము అంటూ కృష్ణ బాబు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: