ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం మంటలు పుట్టిస్తుండగా విశాఖలో మాత్రం తెలుగు తమ్ముళ్ళు అధికార పార్టీపై యధావిధిగా ఆరోపణలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే పనిలో పడ్డారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేయడమే కాకుండా, విశాఖను రాజధానిగా ఎంపిక చేసింది. ఈ మేరకు  రాజధాని ఏర్పాటుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భూములను కూడా సేకరిస్తోంది. అయితే ఈ విషయంపై అదేపనిగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు తెలుగు తమ్ముళ్లు. విశాఖలో ఉన్న ఖాళీ భూములను వైసిపి నాయకులు, పులివెందుల బ్యాచ్ కబ్జా చేస్తోందని, ఇష్టమొచ్చినట్లుగా భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అంటూ అదే పనిగా విమర్శలు మొదలు పెట్టారు. 

 

IHG

అంతేకాకుండా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖలోనే ఎక్కువగా మకాం వేసి వీరందరినీ ముందుకు నడిపిస్తున్నారు అంటూ తెలుగు తమ్ముళ్ళు విమర్శలు చేస్తున్నారు. విశాఖలో భూకబ్జాల బాగోతం ఇప్పటిది కాదు. గత టిడిపి ప్రభుత్వం, అప్పటి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. అప్పట్లో ఈ ఆరోపణలు ఎదుర్కొన్నవారే ఇప్పుడు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. 


విశాఖలో భూకబ్జా ఆరోపణలపై అప్పటి టీడీపీ నాయకుల పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం సిట్ విచారణ కూడా వేసింది. కానీ ఇప్పటి వరకు ఏ విషయము తేలలేదు. విశాఖలో పరిపాలన రాజధాని గా ప్రకటన చేసిన దగ్గర నుంచి అక్కడ భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భూముల అందుబాటులో లేకుండా ధరలు పెరిగిపోయాయి. 


ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా హడావుడిలో ఉండగా, తెలుగు తమ్ముళ్లు మాత్రం వైసిపి నాయకులను టార్గెట్ గా చేసుకుని భూ కబ్జా ఆరోపణలు చేస్తూ కొద్ది రోజులుగా హడావుడి చేస్తుండడం పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: