ఇటీవల గ్రామ వాలంటీర్లు గా ఎంపికైన వారికి చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం లో వైసీపీ నాయకుడు నియామక పత్రాలు అందజేయడం వివాదాస్పదమైంది. వాస్తవానికి అయితే ఈ కార్యక్రమం ప్రభుత్వం చేయాల్సింది. కానీ ఇటీవల వైసీపీ పార్టీ లోకి వచ్చిన కరణం బలరం వర్గీయులు ప్రభుత్వం చేయాల్సిన పనులను తమ చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చీరాల నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారట. వేటపాలెం మండలాల్లో ఖాళీగా ఉన్న గ్రామ వాలంటీర్ల పోస్టులను భర్తీ చేస్తూ ఎంపీడీవోల ఆధ్వర్యంలో నియామక పత్రాలను అందించే విషయంలో వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమృతపాణి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగటం విమర్శలకు దారి తీసింది.

 

ఈ విషయంలో చీరాల నియోజకవర్గంలో వైసీపీ రెండుగా చీలిపోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కరణం బలరాం అనుచర వర్గీయులు ముందు నుండి పార్టీ కోసం చీరాలలో పనిచేసిన ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులను టార్గెట్ చేస్తూ ప్రకారం పక్కన పెడుతున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు అందుతున్నాయి అంటున్నారు. 

 

ఎమ్మెల్యే అనే ట్యాగ్  ఉండటం తోనే ఈ విధంగా కరణం బలరాం వర్గీయులు బేధాలు సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నట్లు చీరాల నియోజకవర్గంలో వార్తలు బలంగా వినబడుతున్నాయి. కరోనా వైరస్ కష్టకాలం లో కనబడని కరణం బలరాం వర్గీయులు అయినటువంటి డాక్టర్ అమృతపాణి , బేబీ రాణి లాంటి వారు ఇప్పుడు తెరమీదికి రావడం పట్ల చీరాల నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా ఇదేమి రాజకీయాల రా బాబు అని పెదవి విరుస్తున్నారు.

 

ఈ విషయంలో అధిష్టానం కలుగ చేసుకోకపోతే వైసీపీ పార్టీకి డామేజ్ జరిగే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది. చీరాల వైకాపా రాజకీయాలలో ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది అని  అది మొత్తం మీద పార్టీ కే చెడ్డపేరు గా మారుతోంది అనేది ప్రధాన వాదన.

మరింత సమాచారం తెలుసుకోండి: