ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ ఏకంగా మనిషి జీవితాన్ని స్థంభించేలా చేస్తుంది. మనిషి జీవిత విధానంలో ఎన్నో మార్పులను తీసుకువచ్చింది. ఇక శర వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. సునామీ ప్రళయం కంటే ప్రస్తుతం ఈ మహమ్మారి వైరస్ ప్రమాదకరంగా మారింది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ దేశాల ప్రజలు అందరూ ప్రాణభయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకును వెళ్లదీస్తున్నారు. ఇక అగ్రరాజ్యాల లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 

 


 అయితే ప్రస్తుతం మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నప్పటికి కూడా ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రజలు తమను తాము కరోనా  వైరస్ కు సంబంధించిన జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. అయితే ఇక ఈ మహమ్మారి వ్యక్తికి సంబంధించి రోజుకొక వార్త తెర మీదికి వచ్చి ప్రజలలో మరింత ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు శాస్త్రవేత్తలందరూ ఈ మహమ్మారి వైరస్ సోకిన వ్యక్తి  సామాజిక దూరం పాటిస్తే వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పారు . కానీ ఈ వైరస్ వ్యాప్తికి గాలిలో  మాత్రం జరగదు అని తెలిపారు. 

 


 కానీ గాలి ద్వారా కూడా కరోనా  వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది అన్న విషయం తాజాగా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని శాన్ డియాగో యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో గాలి ద్వారా ఈ మహమ్మారి వైరస్ ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతుంది అన్న విషయం వెల్లడైంది. ఈ వైరస్ విజృంభించడానికి గాలి ప్రధాన వాహకంగా కూడా పనిచేస్తుందని  తాజాగా సైంటిస్టులు చెప్పుకొచ్చారు. కరోనా  వైరస్ బాధితులు తుమ్మినప్పుడు  వచ్చే తుంపర్ల ఇతరులు పీల్చటం   వల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్తలు.. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం తో పాటు.. ప్రతి మనిషికి మధ్య భౌతిక దూరం ఎంతో ముఖ్యం అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ పరిశోధనలో కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి విజేత అయిన మారిస్ మోలీనా  కూడా ఉండటం  గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: